Nanubuna noorage navvaguraa ! nee

ననుపున నూరకె నవ్వకురా ! నీ
Language

(॥పల్లవి॥)
ననుపున నూరకె నవ్వకురా ! నీ
మనసు రానె నే మాటాడేరా

(॥॥)
మొదలిమాఁట నిను మోచివచ్చితే
వదనకమల మిఁక వంచకురా
కొదలు మాని నాకొంగు వట్టితే
పదివేలు దెలిపేఁ బదగదరా

(॥॥)
సారెకు నీచేఁత సరిగాఁ జూపిన
బీరముతోఁ గోపించకురా
తారుకాణలకు దగ్గరి వచ్చిన
తేరకొనఁగ నిటు తెలిపేరా

(॥॥)
అలమి కాఁగిటను ఆయము లంటిన
మలసి సొలసి మైమఱవకురా
యెలమిని శ్రీ వేంకటేశ కూడితివి
నెలవయి యురమున నిలిచితిరా

(||pallavi||)
nanubuna nūragĕ navvagurā ! nī
manasu rānĕ ne māḍāḍerā

(||||)
mŏdalimām̐ṭa ninu mosivachchide
vadanagamala mim̐ka vaṁchagurā
kŏdalu māni nāgŏṁgu vaṭṭide
padivelu dĕlibem̐ badagadarā

(||||)
sārĕgu nīsem̐ta sarigām̐ jūbina
bīramudom̐ gobiṁchagurā
tārugāṇalagu daggari vachchina
teragŏnam̐ga niḍu tĕliberā

(||||)
alami kām̐giḍanu āyamu laṁṭina
malasi sŏlasi maimaṟavagurā
yĕlamini śhrī veṁkaḍeśha kūḍidivi
nĕlavayi yuramuna nilisidirā