ననుపులేని చనవు నా కేలయ్యా
(॥పల్లవి॥)
ననుపులేని చనవు నా కేలయ్యా
యెనసినవారి మాటే ఇంపులు గాక
(॥॥)
తగవులఁ బెట్టి పెట్టి తమకించి నిన్నుఁ దిట్టి
నగి నిన్ను సాదించ నా కేలయ్యా
మొగము చూడఁగా నీ మోహపు మన్ననవారే
అగ డెంత సేసినాను అమరుఁ గాకా
(॥॥)
సటలకే మొక్కు మొక్కి సంగడి నీ కాలు దొక్కి
నటనలే పచరించ నా కేలయ్యా
ఘటన మందెమేళాన గద్దించే వారే నీకు
చిటుకన నీ సేవలు సేసేరు గాక
(॥॥)
కమ్మటి సన్నలు సేసి కాతరాన గురి వాసి
నమ్మ నంటా బా సడుగ నా కేలయ్యా
యిమ్ముల శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
యెమ్మెలు నీ వెవ్వరైనా నెఱిఁగేరు గాకా.
(||pallavi||)
nanubuleni sanavu nā kelayyā
yĕnasinavāri māḍe iṁpulu gāga
(||||)
tagavulam̐ bĕṭṭi pĕṭṭi tamagiṁchi ninnum̐ diṭṭi
nagi ninnu sādiṁcha nā kelayyā
mŏgamu sūḍam̐gā nī mohabu mannanavāre
aga ḍĕṁta sesinānu amarum̐ gāgā
(||||)
saḍalage mŏkku mŏkki saṁgaḍi nī kālu dŏkki
naḍanale pasariṁcha nā kelayyā
ghaḍana maṁdĕmeḽāna gaddiṁche vāre nīgu
siḍugana nī sevalu seseru gāga
(||||)
kammaḍi sannalu sesi kādarāna guri vāsi
namma naṁṭā bā saḍuga nā kelayyā
yimmula śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
yĕmmĕlu nī vĕvvarainā nĕṟim̐geru gāgā.