Nanu bomti selu lellaa navvaraa ninnu padi

నను బోఁటి చెలు లెల్లా నవ్వరా నిన్ను పతి
Language

(॥పల్లవి॥)
నను బోఁటి చెలు లెల్లా నవ్వరా నిన్ను పతి
చెనకినదాఁకా గుట్టు సేయంగ వలదా

(॥నను॥)
కనుసన్న సేసితేనె కరఁగితి రమణుఁడు
తనువు సోఁకితే నెంత తమకింతువో
యెనసెటివేళనె యిన్నియు నయ్యీఁ గాక
అనువు నీ ప్రియములు అందరిలో వలెనా

(॥నను॥)
మాటలాడినంతలోనే మరుగుగొంటి వాతఁడు
నాటఁగ నవ్వితే నెంత నయ మవుదునో
పాటించి యేకతమందె పచ్చి దేరీఁ గాక నీవు
వాల మైన సరసాలు వాకిటనె వలెనా

(॥నను॥)
యిక్కువఁ గూడినంతలో యిచ్చితివి చన వెల్ల
మొక్కితే విభుని కెంత మోహింతువో
మక్కువ శ్రీవెంకటేశ్వమహిమ లీడేరుఁ గాక
చెక్కులు నొక్కక తొల్లె సిగ్గు లింత వలెనా

(||pallavi||)
nanu bom̐ṭi sĕlu lĕllā navvarā ninnu padi
sĕnaginadām̐kā guṭṭu seyaṁga valadā

(||nanu||)
kanusanna sesidenĕ karam̐gidi ramaṇum̐ḍu
tanuvu som̐kide nĕṁta tamagiṁtuvo
yĕnasĕḍiveḽanĕ yinniyu nayyīm̐ gāga
anuvu nī priyamulu aṁdarilo valĕnā

(||nanu||)
māḍalāḍinaṁtalone marugugŏṁṭi vādam̐ḍu
nāḍam̐ga navvide nĕṁta naya mavuduno
pāḍiṁchi yegadamaṁdĕ pachchi derīm̐ gāga nīvu
vāla maina sarasālu vāgiḍanĕ valĕnā

(||nanu||)
yikkuvam̐ gūḍinaṁtalo yichchidivi sana vĕlla
mŏkkide vibhuni kĕṁta mohiṁtuvo
makkuva śhrīvĕṁkaḍeśhvamahima līḍerum̐ gāga
sĕkkulu nŏkkaga tŏllĕ siggu liṁta valĕnā