నన్నుఁ జూచి నీవేమి నవ్వేవిఁక
(॥పల్లవి॥)
నన్నుఁ జూచి నీవేమి నవ్వేవిఁక
సన్నలఁ జాయల నీకు జయమాయనే
(॥నన్ను॥)
వేలివుంగర మిచ్చెను విభుడు నీ కిప్పు డిట్టె
యేలవమ్మ సవతుల నిందరి నిక
పాలించె గప్రబాగాలు పలుమారు నింతలోనె
చాలుకొన్న కాంతలను సాదించవే
(॥నన్ను॥)
బల్లిదుడు సరిగద్దెపై గూచుండబెట్టుకొనె
చెల్లెండ్లకు బనులు చెప్ప గదవే
అల్లదె నీతో నవ్వి అపమిచ్చె నీ కిన్నిటా
చెల్లు మాచె వూడిగాలు సేయించుకోవే
(॥నన్ను॥)
శ్రీవేంకటేశుడు నీచేయి వట్టి పెండ్లాడె
లావుల బట్టపుదెవులవు గావే
యీవల నాకాగిటను యీత డిరవయినాడు
కైవశమై మాకెల్లా గర్తవైతివే
(||pallavi||)
nannum̐ jūsi nīvemi navvevim̐ka
sannalam̐ jāyala nīgu jayamāyane
(||nannu||)
velivuṁgara michchĕnu vibhuḍu nī kippu ḍiṭṭĕ
yelavamma savadula niṁdari niga
pāliṁchĕ gaprabāgālu palumāru niṁtalonĕ
sālugŏnna kāṁtalanu sādiṁchave
(||nannu||)
balliduḍu sarigaddĕbai gūsuṁḍabĕṭṭugŏnĕ
sĕllĕṁḍlagu banulu sĕppa gadave
alladĕ nīdo navvi abamichchĕ nī kinniḍā
sĕllu māsĕ vūḍigālu seyiṁchugove
(||nannu||)
śhrīveṁkaḍeśhuḍu nīseyi vaṭṭi pĕṁḍlāḍĕ
lāvula baṭṭabudĕvulavu gāve
yīvala nāgāgiḍanu yīda ḍiravayināḍu
kaivaśhamai māgĕllā gardavaidive