Nannum joosi naalone navvuvachcheeni

నన్నుఁ జూచి నాలోనే నవ్వువచ్చీని
Language

(॥పల్లవి॥)
నన్నుఁ జూచి నాలోనే నవ్వువచ్చీని
యెన్నిక నో చెలులాల యేమి సోద్యమే

(॥నన్నుఁ॥)
యెచ్చరించి సారె సారె నెలయించీ మనసు
పెచ్చురేఁగి తమకము పెనచీ మనసు
తచ్చి యాతని పొందులు తలఁపించీ మనసు
యిచ్చట నో చెలులాల యేమని చెప్పుదునే

(॥నన్నుఁ॥)
యెదురు చూపించి బయలీఁదించీ మనసు
కదిసేటి యాసలఁ గరఁగించీ మనసు
గుదిగొని రతులెల్లాఁ గోరించీ మనసు
యిదివో చెలులాల యేమి సేతునే

(॥నన్నుఁ॥)
చెప్పరాని ప్రియములు చెప్పించీ మనసు
ముప్పిరి నా వలపులు ముదిరించీ మనసు
అప్పుడు శ్రీవేంకటేశుఁ డాతఁడే వచ్చి నన్నేలె
యిప్పుడు వో చెలులాల యేమందునే

(||pallavi||)
nannum̐ jūsi nālone navvuvachchīni
yĕnniga no sĕlulāla yemi sodyame

(||nannum̐||)
yĕchchariṁchi sārĕ sārĕ nĕlayiṁchī manasu
pĕchchurem̐gi tamagamu pĕnasī manasu
tachchi yādani pŏṁdulu talam̐piṁchī manasu
yichchaḍa no sĕlulāla yemani sĕppudune

(||nannum̐||)
yĕduru sūbiṁchi bayalīm̐diṁchī manasu
kadiseḍi yāsalam̐ garam̐giṁchī manasu
gudigŏni radulĕllām̐ goriṁchī manasu
yidivo sĕlulāla yemi sedune

(||nannum̐||)
sĕpparāni priyamulu sĕppiṁchī manasu
muppiri nā valabulu mudiriṁchī manasu
appuḍu śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe vachchi nannelĕ
yippuḍu vo sĕlulāla yemaṁdune