నన్నుఁ జూచి నాకు నాకే నవ్వు వచ్చీని
(॥పల్లవి॥)
నన్నుఁ జూచి నాకు నాకే నవ్వు వచ్చీని
మిన్నక నా జవ్వనమే మేరలు మీరఁగను
(॥నన్నుఁ॥)
వలచిన వలపులే వలలై తగులుకోఁగా
చెలుల దూరితే నేమి సేయఁగలవే
పలికిన పలుకులే బాసలై తొడరఁగాను
చలపట్టి బొమ్మలను జింకించఁబనేమే
(॥నన్నుఁ॥)
కనుఁగొన చూపులే కడునాస వుట్టించఁగా
వెనక మరుని మీఁద వేసారనేలే
మనసు కొర్కెలే మర్మములు రేఁచఁగాను
పెనచి చెక్కిటఁ జేయిపెట్టఁగ మరేలే
(॥నన్నుఁ॥)
కందువ చుట్టరికమే కాఁగిటఁగూరుచఁగా
సందడి సిగ్గులతోడ జరయనేలే
యిందుకే వచ్చి శ్రీవేంకటేశుఁ డిప్పడే నన్నేలె
అందుకోను సరసాల నంత యనఁగనేలే
(||pallavi||)
nannum̐ jūsi nāgu nāge navvu vachchīni
minnaga nā javvaname meralu mīram̐ganu
(||nannum̐||)
valasina valabule valalai tagulugom̐gā
sĕlula dūride nemi seyam̐galave
paligina palugule bāsalai tŏḍaram̐gānu
salabaṭṭi bŏmmalanu jiṁkiṁcham̐baneme
(||nannum̐||)
kanum̐gŏna sūbule kaḍunāsa vuṭṭiṁcham̐gā
vĕnaga maruni mīm̐da vesāranele
manasu kŏrgĕle marmamulu rem̐sam̐gānu
pĕnasi sĕkkiḍam̐ jeyibĕṭṭam̐ga marele
(||nannum̐||)
kaṁduva suṭṭarigame kām̐giḍam̐gūrusam̐gā
saṁdaḍi sigguladoḍa jarayanele
yiṁduge vachchi śhrīveṁkaḍeśhum̐ ḍippaḍe nannelĕ
aṁdugonu sarasāla naṁta yanam̐ganele