Nannum joosi kaadaraana navvulu vachcheem gaaga

నన్నుఁ జూచి కాతరాన నవ్వులు వచ్చీఁ గాక
Language

(॥పల్లవి॥)
నన్నుఁ జూచి కాతరాన నవ్వులు వచ్చీఁ గాక
వున్నతి నాపె వచ్చితే నొల్ల కెట్లా నుండెనే

(॥॥)
తప్ప కాపె రూ పేపొద్దూ తనలోనే గుబ్బతిలు
చెప్పి పంపిన మాటలఁ జిల్లులౌ గుండె
చొప్పుల మై గురుతులు చూచుకొంటే నీరౌ మతి
యిప్పుడాపెఁ గూడక తా నెట్టో రువఁగలఁడే

(॥॥)
మరిగి నాపె యెదుట మలసితేఁ జిమ్మి రేఁగు
తిరిగి చూచితేఁ దరితీపు పుట్టును
తొరలఁగ సొలసితే తూరిపారు(?) మర్మములు
యిరవైన యాపెఁ బాసి యెట్టోరువఁ గలఁడే

(॥॥)
తనమొగ మాపె యైతే తమకము లుప్పతిల్లు
ననుపుల నవ్వు గంటే నాము లెక్కును
యెనసి శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్ను మెచ్చి
యెనలేని యాపెను తా నెట్టు మానఁగలఁడే

(||pallavi||)
nannum̐ jūsi kādarāna navvulu vachchīm̐ gāga
vunnadi nābĕ vachchide nŏlla kĕṭlā nuṁḍĕne

(||||)
tappa kābĕ rū pebŏddū tanalone gubbadilu
sĕppi paṁpina māḍalam̐ jillulau guṁḍĕ
sŏppula mai gurudulu sūsugŏṁṭe nīrau madi
yippuḍābĕm̐ gūḍaga tā nĕṭṭo ruvam̐galam̐ḍe

(||||)
marigi nābĕ yĕduḍa malasidem̐ jimmi rem̐gu
tirigi sūsidem̐ daridību puṭṭunu
tŏralam̐ga sŏlaside tūribāru(?) marmamulu
yiravaina yābĕm̐ bāsi yĕṭṭoruvam̐ galam̐ḍe

(||||)
tanamŏga mābĕ yaide tamagamu luppadillu
nanubula navvu gaṁṭe nāmu lĕkkunu
yĕnasi śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu mĕchchi
yĕnaleni yābĕnu tā nĕṭṭu mānam̐galam̐ḍe