Nannum baasi vumda nela naa yaalagu raa nela

నన్నుఁ బాసి వుండ నేల నా యాలకు రా నేల
Language

(॥పల్లవి॥)
నన్నుఁ బాసి వుండ నేల నా యాలకు రా నేల
వున్నట్లానె వుంటే వొరసేరా నిన్ను

(॥నన్ను॥)
కాంతలఁ దిట్టఁగ నేల కాని కాని వొట్లేల
యింతట నీ గుణము నే నెఱఁగనిదా
పంతపుసాకిరు లేల పతితారుకాణ లేల
వంతన నా వద్ద నుంటే వచ్చీనా నిందలు

(॥నన్ను॥)
పదరి కోపించ నేల బాసలు సేయఁగ నేల
కదిసి నీ మోహము నేఁ గన్నదె కాదా
వదరుఁబెదవు లెండ వాదు లడువఁగ నేల
అదన నావద్ద నుంటే ఆడేరా నిన్నును

(॥నన్ను॥)
నే నెంతైనా నమ్మ నంటా నీకె యలుక లేల
కానీ లేరా యిన్నియు నేఁ గన్నవె కావా
పూని శ్రీవెంకటేశుఁడ వొడఁబరచి కూడితి
నేను నీవూ నిట్టె వుంటే నేఁ డనేరా నిన్మునూ

(||pallavi||)
nannum̐ bāsi vuṁḍa nela nā yālagu rā nela
vunnaṭlānĕ vuṁṭe vŏraserā ninnu

(||nannu||)
kāṁtalam̐ diṭṭam̐ga nela kāni kāni vŏṭlela
yiṁtaḍa nī guṇamu ne nĕṟam̐ganidā
paṁtabusāgiru lela padidārugāṇa lela
vaṁtana nā vadda nuṁṭe vachchīnā niṁdalu

(||nannu||)
padari kobiṁcha nela bāsalu seyam̐ga nela
kadisi nī mohamu nem̐ gannadĕ kādā
vadarum̐bĕdavu lĕṁḍa vādu laḍuvam̐ga nela
adana nāvadda nuṁṭe āḍerā ninnunu

(||nannu||)
ne nĕṁtainā namma naṁṭā nīgĕ yaluga lela
kānī lerā yinniyu nem̐ gannavĕ kāvā
pūni śhrīvĕṁkaḍeśhum̐ḍa vŏḍam̐barasi kūḍidi
nenu nīvū niṭṭĕ vuṁṭe nem̐ ḍanerā ninmunū