Nannu vaamdeṟumgu vaani nanubu ne neṟumgudu

నన్ను వాఁడెఱుఁగు వాని ననుపు నే నెఱుఁగుదు
Language

(॥పల్లవి॥)
నన్ను వాఁడెఱుఁగు వాని ననుపు నే నెఱుఁగుదు
యెన్నికలు వేరే యాల యెంచీరే చెలులు

(॥నన్ను॥)
తొలుతే మోహపురతి తోడుకరా నంపనేల
తలఁపులే తమకమే తరవు గాదా
మలసి మలసి లోలో మర్మములు సళుపఁగా
యెలమి నిందుకు రా కెటుండనే వాఁడు

(॥నన్ను॥)
యేకమైన దేహములు యెక్కడ నుండినా నేమి
దాకొన్నప్రాణము లొక్కతగులే కాదా
పైకొనీ గుండెలు మోఁచి పంచబాణము లుండఁగా
చేకొని విరహములు చిమ్మిరేఁచ కుండునా

(॥నన్ను॥)
యిద్దరముఁ గూడినప్పు డెవ్వరిఁ గొసర నేల
సుద్దులముచ్చటలే సూట్లు గావా
వొద్దికాయ శ్రీవేంకటోత్తముఁడు విచ్చేసి
పొద్దు వొద్దున కన్నిటా భోగములే కావా

(||pallavi||)
nannu vām̐ḍĕṟum̐gu vāni nanubu ne nĕṟum̐gudu
yĕnnigalu vere yāla yĕṁchīre sĕlulu

(||nannu||)
tŏlude mohaburadi toḍugarā naṁpanela
talam̐pule tamagame taravu gādā
malasi malasi lolo marmamulu saḽubam̐gā
yĕlami niṁdugu rā kĕḍuṁḍane vām̐ḍu

(||nannu||)
yegamaina dehamulu yĕkkaḍa nuṁḍinā nemi
dāgŏnnaprāṇamu lŏkkadagule kādā
paigŏnī guṁḍĕlu mom̐si paṁchabāṇamu luṁḍam̐gā
segŏni virahamulu simmirem̐sa kuṁḍunā

(||nannu||)
yiddaramum̐ gūḍinappu ḍĕvvarim̐ gŏsara nela
suddulamuchchaḍale sūṭlu gāvā
vŏddigāya śhrīveṁkaḍottamum̐ḍu vichchesi
pŏddu vŏdduna kanniḍā bhogamule kāvā