Nannu ninnu nemchugovo naaraayanaa

నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా
Language

(॥పల్లవి॥)
నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా
అన్నియు నీ చేతినే అదివో నారాయణా

(॥నన్ను॥)
నా మన సెఱుఁగవా నారాయణా నేఁడు
నాము లాయె వయసులు నారాయణా
నామధారికపు మొక్కు నారాయణా
ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా

(॥నన్ను॥)
నగుతా నే నంటి నింతే నారాయణా యిదె
నగ రెఱిఁగినపని నారాయణా
నగవులు మాకుఁ జాలు నారాయణా
అగడుసేయకు మిఁక నప్పటి నారాయణా

(॥నన్ను॥)
ననలు నీ వినయాలు నారాయణా, మంచి
నను పంటి మిదివో నారాయణా
ఘనుఁడ శ్రీవేంకటాద్రిఁ గలసితి విట్లైనను
అనుమాన మెల్లాఁ బాసె నందు నారాయణా

(||pallavi||)
nannu ninnu nĕṁchugovo nārāyaṇā
anniyu nī sedine adivo nārāyaṇā

(||nannu||)
nā mana sĕṟum̐gavā nārāyaṇā nem̐ḍu
nāmu lāyĕ vayasulu nārāyaṇā
nāmadhārigabu mŏkku nārāyaṇā
āmugŏni nī priyamu laṁdune nārāyaṇā

(||nannu||)
nagudā ne naṁṭi niṁte nārāyaṇā yidĕ
naga rĕṟim̐ginabani nārāyaṇā
nagavulu māgum̐ jālu nārāyaṇā
agaḍuseyagu mim̐ka nappaḍi nārāyaṇā

(||nannu||)
nanalu nī vinayālu nārāyaṇā, maṁchi
nanu paṁṭi midivo nārāyaṇā
ghanum̐ḍa śhrīveṁkaḍādrim̐ galasidi viṭlainanu
anumāna mĕllām̐ bāsĕ naṁdu nārāyaṇā