నన్ను నింతసేసినాఁడు నాయకుఁడు వలపించి
(॥పల్లవి॥)
నన్ను నింతసేసినాఁడు నాయకుఁడు వలపించి
అన్నిటా మన్నించె నింకా నాఁపరాదు మనసు
(॥నన్ను॥)
విందమువో తనమాట వేడుక నేమిచెప్పీనో
పెందలకాడే దూతికఁ బిలిచి తేవే
పందెమువేసె నా తోను పతిఁదెచ్చే నంటాను
అందాఁకాఁ జివి రేఁగీ ఆఁపరాదు మనసు
(॥నన్ను॥)
చూతమువో తనమోము సొమ్ము లేమిదెచ్చీనో
దూతిక యిక్కడికే తోడుకరావే
యేతులు నెరపె నాతో నిట్టె పొందులు సేసేనంటా
ఆతనిఁజూచినదాఁకా నాఁపరాదు మనసు
(॥నన్ను॥)
ఇత్తమువో తనకు మెచ్చి యిట్టె యాతనిఁ జూపితే
బిత్తరపుదూతివి రప్పించవే ఇందు
ఇత్తల శ్రీవేంకటేశు నెనయించెఁ దా నింతలో
హత్తి కూడె నీతఁడింకా నాఁపరాదు మనసు
(||pallavi||)
nannu niṁtasesinām̐ḍu nāyagum̐ḍu valabiṁchi
anniḍā manniṁchĕ niṁkā nām̐parādu manasu
(||nannu||)
viṁdamuvo tanamāḍa veḍuga nemisĕppīno
pĕṁdalagāḍe dūdigam̐ bilisi teve
paṁdĕmuvesĕ nā tonu padim̐dĕchche naṁṭānu
aṁdām̐kām̐ jivi rem̐gī ām̐parādu manasu
(||nannu||)
sūdamuvo tanamomu sŏmmu lemidĕchchīno
dūdiga yikkaḍige toḍugarāve
yedulu nĕrabĕ nādo niṭṭĕ pŏṁdulu sesenaṁṭā
ādanim̐jūsinadām̐kā nām̐parādu manasu
(||nannu||)
ittamuvo tanagu mĕchchi yiṭṭĕ yādanim̐ jūbide
bittarabudūdivi rappiṁchave iṁdu
ittala śhrīveṁkaḍeśhu nĕnayiṁchĕm̐ dā niṁtalo
hatti kūḍĕ nīdam̐ḍiṁkā nām̐parādu manasu