నన్ను నింతగా మనిపె నాకేల వేగిరించ
(॥పల్లవి॥)
నన్ను నింతగా మనిపె నాకేల వేగిరించ
యిన్నిటా నా వలపాతఁడీడేర్చీఁ గాక
(॥నన్ను॥)
చిత్తగించి పిలిచితే సేవలు సేయుట గాక
వొత్తిపతిఁ గొంగు వట్టు టుచితమౌనా
బత్తి గలవారు వొకపరి మరచి వుంటేను
హత్తి మరొకపరైనా నట్టే మన్నించీఁ గాక
(॥నన్ను॥)
నెట్టుకొని చూచితేను నిలిచి మొక్కుట గాక
వొట్టుక తనుఁ గొసర నుచితమౌనా
యెట్టూ నన్ను నేలినాఁడు యీవేళ నవ్వకుండినా
అట్టె వేరొకవేళ ఆదరించీఁ గాక
(॥నన్ను॥)
సరుసఁ గూచుండితేను సరసమాడుట గాక
వొరయ శ్రీవేంకటేశు నుచితమౌనా
అరుదైన దేవినైతి నలమేల్మంగను నేను
నిరతి నాఁడట్లుంటే నేఁడు గూడీఁ గాక
(||pallavi||)
nannu niṁtagā manibĕ nāgela vegiriṁcha
yinniḍā nā valabādam̐ḍīḍersīm̐ gāga
(||nannu||)
sittagiṁchi piliside sevalu seyuḍa gāga
vŏttibadim̐ gŏṁgu vaṭṭu ṭusidamaunā
batti galavāru vŏgabari marasi vuṁṭenu
hatti marŏgabarainā naṭṭe manniṁchīm̐ gāga
(||nannu||)
nĕṭṭugŏni sūsidenu nilisi mŏkkuḍa gāga
vŏṭṭuga tanum̐ gŏsara nusidamaunā
yĕṭṭū nannu nelinām̐ḍu yīveḽa navvaguṁḍinā
aṭṭĕ verŏgaveḽa ādariṁchīm̐ gāga
(||nannu||)
sarusam̐ gūsuṁḍidenu sarasamāḍuḍa gāga
vŏraya śhrīveṁkaḍeśhu nusidamaunā
arudaina devinaidi nalamelmaṁganu nenu
niradi nām̐ḍaṭluṁṭe nem̐ḍu gūḍīm̐ gāga