Nannu nene aahahaa navvugonavaladaa

నన్ను నేనే ఆహహా నవ్వుకొనవలదా
Language

(॥పల్లవి॥)
నన్ను నేనే ఆహహా నవ్వుకొనవలదా
యిన్ని వెలుతుల నేను యెదురి నాడేదుట (?)

(॥నన్ను॥)
చేరి దిగంబరి యట చీరల దిండ్లటా
సారెను విరతి యట సంసార మటా
పేరు మౌన వ్రతి యట బిరుదువాదము లటా
యీరీతి నే దొర నట యిందరి వేఁడేదటా

(॥నన్ను॥)
చప్పిడయ్యఁగా రట వుప్పుపెరికలు నట
గొప్పయిన తపసి నట కొలువూ నట
అప్పటి నిరాహారి నట ఆరంభము లట
చిప్పిలి మనసు ముడి సింగారా లట

(॥నన్ను॥)
పెంపు జతేంద్రియుఁ డట పెండ్లిశోభనమట
ముంపున మోక్షార్థి యట లంపట మట
యింపుల శ్రీవేంకటేశ యిన్నిభావములఁ బొంది
తెంపున నీ శరణని తెలిసితి నటా

(||pallavi||)
nannu nene āhahā navvugŏnavaladā
yinni vĕludula nenu yĕduri nāḍeduḍa (?)

(||nannu||)
seri digaṁbari yaḍa sīrala diṁḍlaḍā
sārĕnu viradi yaḍa saṁsāra maḍā
peru mauna vradi yaḍa biruduvādamu laḍā
yīrīdi ne dŏra naḍa yiṁdari vem̐ḍedaḍā

(||nannu||)
sappiḍayyam̐gā raḍa vuppubĕrigalu naḍa
gŏppayina tabasi naḍa kŏluvū naḍa
appaḍi nirāhāri naḍa āraṁbhamu laḍa
sippili manasu muḍi siṁgārā laḍa

(||nannu||)
pĕṁpu jadeṁdriyum̐ ḍaḍa pĕṁḍliśhobhanamaḍa
muṁpuna mokṣhārdhi yaḍa laṁpaḍa maḍa
yiṁpula śhrīveṁkaḍeśha yinnibhāvamulam̐ bŏṁdi
tĕṁpuna nī śharaṇani tĕlisidi naḍā