Nannu nemchugona nayyaa nagumbaatla nenu

నన్ను నెంచుకొన నయ్యా నగుఁబాట్ల నేను
Language

(॥పల్లవి॥)
నన్ను నెంచుకొన నయ్యా నగుఁబాట్ల నేను
కన్నవారి విన్నవారిఁ గాకు సేసేనే

(॥నన్ను॥)
మలసి నా గుణములు మంచివై నప్పుడు గదా
యెలమి నెదిరి నేరము లెంచేది
చెలఁగి నే పాపములు సేయకుండె మరి కదా
తొలఁగి పరుల నే దూషించేది

(॥నన్ను॥)
నడవడి నే లెన్స నడిచినప్పుడు గదా
పొడవై యన్యులకు నే బుద్ధి చెప్పేది
వెడఁగై యితరుల నే వేఁడనియప్పుడు గదా
కడవారి విరక్తి గాదనేది

(॥నన్ను॥)
కామినుల సంగమము కాదని నే మరి కదా
నేమమై యితరుల నే నిందించేది
నామదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి
నీ మఱఁగు చొచ్చితి నేఁడు శ్రీ వేంకటేశ

(||pallavi||)
nannu nĕṁchugŏna nayyā nagum̐bāṭla nenu
kannavāri vinnavārim̐ gāgu sesene

(||nannu||)
malasi nā guṇamulu maṁchivai nappuḍu gadā
yĕlami nĕdiri neramu lĕṁchedi
sĕlam̐gi ne pābamulu seyaguṁḍĕ mari kadā
tŏlam̐gi parula ne dūṣhiṁchedi

(||nannu||)
naḍavaḍi ne lĕnsa naḍisinappuḍu gadā
pŏḍavai yanyulagu ne buddhi sĕppedi
vĕḍam̐gai yidarula ne vem̐ḍaniyappuḍu gadā
kaḍavāri virakti gādanedi

(||nannu||)
kāminula saṁgamamu kādani ne mari kadā
nemamai yidarula ne niṁdiṁchedi
nāmadilo nannu nenu navvugŏni siggubaḍi
nī maṟam̐gu sŏchchidi nem̐ḍu śhrī veṁkaḍeśha