నన్ను నేలినాఁ డితఁడు నరసింహుఁడు
(॥పల్లవి॥)
నన్ను నేలినాఁ డితఁడు నరసింహుఁడు
అన్నిటాను జాణఁడు ప్రహ్లాదనారసింహుఁడు
(॥పన్ను॥)
నగవులవాఁడుగదె నరసింహుడు
వెగటులేనివాఁడు వీరనరసింహుఁడు
నగముపైనున్న వాఁడు నరసింహుఁడు
అగపడె మనకుఁ బ్రహ్ల్మాదనరసింహుడు
(॥పన్ను॥)
ననవిలుతునితండ్రి నరసింహుడు
కనకపుకాశ(సె?) వాఁడు గజనరసింహుడు
ననుపుపొందులు సేసే నరసింహుఁడు
అనిశము బాయడు ప్రహ్లాదనరసింహుడు
(॥పన్ను॥)
నాతో సరసమాడీ నరసింహుఁడు నా
చేతికి నుంగరమిచ్చె శ్రీ నరసింహుడు
యేతుల శ్రీవేంకటాద్రి నిదే యహోబలమున
ఆతుమలోఁ బాయఁడు ప్రహ్లాదనరసింహుఁడు
(||pallavi||)
nannu nelinām̐ ḍidam̐ḍu narasiṁhum̐ḍu
anniḍānu jāṇam̐ḍu prahlādanārasiṁhum̐ḍu
(||pannu||)
nagavulavām̐ḍugadĕ narasiṁhuḍu
vĕgaḍulenivām̐ḍu vīranarasiṁhum̐ḍu
nagamubainunna vām̐ḍu narasiṁhum̐ḍu
agabaḍĕ managum̐ brahlmādanarasiṁhuḍu
(||pannu||)
nanaviludunidaṁḍri narasiṁhuḍu
kanagabugāśha(sĕ?) vām̐ḍu gajanarasiṁhuḍu
nanububŏṁdulu sese narasiṁhum̐ḍu
aniśhamu bāyaḍu prahlādanarasiṁhuḍu
(||pannu||)
nādo sarasamāḍī narasiṁhum̐ḍu nā
sedigi nuṁgaramichchĕ śhrī narasiṁhuḍu
yedula śhrīveṁkaḍādri nide yahobalamuna
ādumalom̐ bāyam̐ḍu prahlādanarasiṁhum̐ḍu