నన్ను నేల తడవేవు నాజాడ నీవెఱఁగవా
(॥పల్లవి॥)
నన్ను నేల తడవేవు నాజాడ నీవెఱఁగవా
యెన్నిక నిను దగ్గర నిది వేళా నాకు
(॥నన్ను ॥)
చాయలకు నాపె నీతో సరసములాడఁగాను
నాయమా నీతో నాకు నవ్వఁగ నేఁడు
చేయి చాఁచి యప్పటిని చెనకులు చెనకఁగా
యీయెడ నీసేవ సేయ నిది వేళా నాకు
(॥నన్ను॥)
యెలయించి యాపె నిన్ను నేకతానకుఁ దియ్యఁగా
చలమా నిన్నుఁ బిలువ సారెకు నాకు
పలుమారుఁ దానె నీతోఁ బచ్చిమాఁటలాడఁగాను
యెలమి నే విడెమీయ నిది వేళా నాకు
(॥నన్ను॥)
గరిమ నాపె నిన్నుఁ గాఁగిలించుకుండఁగాను
పురుఁడా నేను నట్టె పొత్తుగలయ
ఇరవై శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
యెరవులేక కొసర నిది వేళా నాకు
(||pallavi||)
nannu nela taḍavevu nājāḍa nīvĕṟam̐gavā
yĕnniga ninu daggara nidi veḽā nāgu
(||nannu ||)
sāyalagu nābĕ nīdo sarasamulāḍam̐gānu
nāyamā nīdo nāgu navvam̐ga nem̐ḍu
seyi sām̐si yappaḍini sĕnagulu sĕnagam̐gā
yīyĕḍa nīseva seya nidi veḽā nāgu
(||nannu||)
yĕlayiṁchi yābĕ ninnu negadānagum̐ diyyam̐gā
salamā ninnum̐ biluva sārĕgu nāgu
palumārum̐ dānĕ nīdom̐ bachchimām̐ṭalāḍam̐gānu
yĕlami ne viḍĕmīya nidi veḽā nāgu
(||nannu||)
garima nābĕ ninnum̐ gām̐giliṁchuguṁḍam̐gānu
purum̐ḍā nenu naṭṭĕ pŏttugalaya
iravai śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
yĕravulega kŏsara nidi veḽā nāgu