నన్ను నేల సొలసేవు నగితి నింతే యిందుకు
(॥పల్లవి॥)
నన్ను నేల సొలసేవు నగితి నింతే యిందుకు
అన్నిటా నీ లాగులకు నడ్డము రాఁగలనా
(॥నన్ను॥)
కంచము మోవి పొత్తుల కాంతనే యిందరు నీకు
మంచముపై కెక్కినట్టు మందెమేళాలు
యెంచి నేఁడు మానుమంటే యేలమానునిఁక నిన్ను
వంచుక యేమి సేసినా వారివారి పుణ్యము
(॥నన్ను॥)
పిడికిటిసేసతోడి పేరంటాండ్లే ఇందరును
వొడలుసోఁకినయట్టి వుద్దండములు
జడియ నీమొగమోట సారె నీకు నేల మాను
వడిబెట్టి నిన్నుఁ బొందే వారివారి పుణ్యము
(॥నన్ను॥)
చలములరతికేలిసవతులే ఇందరును
ములుగోరిసరసాలమొగమోటాలు
యెలమి శ్రీవేంకటేశ యెనసితి విదె నన్ను
వలపించి చొక్కించిననవారివారి పుణ్యము
(||pallavi||)
nannu nela sŏlasevu nagidi niṁte yiṁdugu
anniḍā nī lāgulagu naḍḍamu rām̐galanā
(||nannu||)
kaṁchamu movi pŏttula kāṁtane yiṁdaru nīgu
maṁchamubai kĕkkinaṭṭu maṁdĕmeḽālu
yĕṁchi nem̐ḍu mānumaṁṭe yelamānunim̐ka ninnu
vaṁchuga yemi sesinā vārivāri puṇyamu
(||nannu||)
piḍigiḍisesadoḍi peraṁṭāṁḍle iṁdarunu
vŏḍalusom̐kinayaṭṭi vuddaṁḍamulu
jaḍiya nīmŏgamoḍa sārĕ nīgu nela mānu
vaḍibĕṭṭi ninnum̐ bŏṁde vārivāri puṇyamu
(||nannu||)
salamularadigelisavadule iṁdarunu
mulugorisarasālamŏgamoḍālu
yĕlami śhrīveṁkaḍeśha yĕnasidi vidĕ nannu
valabiṁchi sŏkkiṁchinanavārivāri puṇyamu