Nannu nela senagevu narasimhaa

నన్ను నేల చెనకేవు నరసింహా
Language

(॥పల్లవి॥)
నన్ను నేల చెనకేవు నరసింహా
చిన్నవాఁడే నీవారము శ్రీనరసింహా

(॥నన్ను॥)
తొడపై నెక్కిన దాపె దోమటి దొడికె నాపె
కొడిమె వట్టివారెల్లా కొమరాఁకలే
వొడలు నిమిరె నాపె వొద్ద నున్నది యాపె
అడుగవయ్యా నీవు ఆపెనే నీసుద్దులు

(॥నన్ను॥)
చిమ్ముచుఁ జూచిన దాపె సే వెట్టినది యాపె
కమ్మి యెదుటివారెల్లా కన్నులకసే
సమ్మతించినది యాపె చనవుగలది యాపె
యెమ్మెలకే నవ్వవయ్య యీపెతో నీనవ్వులు

(॥నన్ను॥)
లక్కిమమ్మ నీ కాపె లలి భూదేవిని నేను
చిక్కినవారెల్లా వట్టిచెల్లాటాలే
వొక్కటైతిమి శ్రీ వేంకటోత్తమ అహోబలేశ
లక్కచెల్లెండ్లము నాకు నాపెకు నీతగులూ

(||pallavi||)
nannu nela sĕnagevu narasiṁhā
sinnavām̐ḍe nīvāramu śhrīnarasiṁhā

(||nannu||)
tŏḍabai nĕkkina dābĕ domaḍi dŏḍigĕ nābĕ
kŏḍimĕ vaṭṭivārĕllā kŏmarām̐kale
vŏḍalu nimirĕ nābĕ vŏdda nunnadi yābĕ
aḍugavayyā nīvu ābĕne nīsuddulu

(||nannu||)
simmusum̐ jūsina dābĕ se vĕṭṭinadi yābĕ
kammi yĕduḍivārĕllā kannulagase
sammadiṁchinadi yābĕ sanavugaladi yābĕ
yĕmmĕlage navvavayya yībĕdo nīnavvulu

(||nannu||)
lakkimamma nī kābĕ lali bhūdevini nenu
sikkinavārĕllā vaṭṭisĕllāḍāle
vŏkkaḍaidimi śhrī veṁkaḍottama ahobaleśha
lakkasĕllĕṁḍlamu nāgu nābĕgu nīdagulū