Nannu nela pogadevu navveru ninnu

నన్ను నేల పొగడేవు నవ్వేరు నిన్ను
Language

(॥పల్లవి॥)
నన్ను నేల పొగడేవు నవ్వేరు నిన్ను
కన్నెలు నీ పొందులకుఁ గాచుకిట్టేవుండఁగా

(॥॥)
బలిమేల సేసేవు బాఁతిపడి నాతోను
యెలమి నావంటి చెలు లెందరు లేదు
కలకాలమును వూడిగపు కాంత నింతే నేను
చలమేల దొడ్డ దొడ్డ సతులెల్లనుండఁగా

(॥॥)
చేయివట్టి తీసేవు చిఱునవ్వులు నవ్వుతా
డాయ వచ్చిరిందరుఁ జుట్టాలే నీకు
బాయిట సమ్మాళిగెలుపట్టే తొత్త నీకు
వేయకు మాపైఁ జేయి వేలయాండ్లుండఁగా

(॥॥)
చన్ను లేల పిసికేవు సరి నాకాఁగిటఁ గూడి
వన్నెల నీవేళ నాఁడువారే వున్నారు
అన్నిటా నీవు భోగించినట్టి యెంగిలి నేనింతే
మన్నించు శ్రీవేంకటేశ మావారిందరుండఁగా

(||pallavi||)
nannu nela pŏgaḍevu navveru ninnu
kannĕlu nī pŏṁdulagum̐ gāsugiṭṭevuṁḍam̐gā

(||||)
balimela sesevu bām̐tibaḍi nādonu
yĕlami nāvaṁṭi sĕlu lĕṁdaru ledu
kalagālamunu vūḍigabu kāṁta niṁte nenu
salamela dŏḍḍa dŏḍḍa sadulĕllanuṁḍam̐gā

(||||)
seyivaṭṭi tīsevu siṟunavvulu navvudā
ḍāya vachchiriṁdarum̐ juṭṭāle nīgu
bāyiḍa sammāḽigĕlubaṭṭe tŏtta nīgu
veyagu mābaim̐ jeyi velayāṁḍluṁḍam̐gā

(||||)
sannu lela pisigevu sari nāgām̐giḍam̐ gūḍi
vannĕla nīveḽa nām̐ḍuvāre vunnāru
anniḍā nīvu bhogiṁchinaṭṭi yĕṁgili neniṁte
manniṁchu śhrīveṁkaḍeśha māvāriṁdaruṁḍam̐gā