నన్ను నేల దూరేవు నడుమ నీవు
(॥పల్లవి॥)
నన్ను నేల దూరేవు నడుమ నీవు
యెన్నిలేవు నీ వేసాలు యెంతసేసేవే
(॥॥)
చలపట్టి నీవతని సాదించి నేరుపుతో
వలపించుకోఁగాను వద్దంటినా
మొలకనవ్వులు నవ్వి ముందె యాతనిచిత్తఁ
మలర వలపించఁగా నడ్డము వచ్చితినా
(॥॥)
గొంటరితనాన నీవు కొంగువట్టుకొని పతిఁ
నింటికి రప్పించుకోగా నేలంటినా
జంపునీచన్నలనొత్తి సమరతులకుఁ దీసి
అంటి దక్కఁగొనఁగా నేనందుకుఁ గాదంటినా
(॥॥)
ఇరవుగ నప్పటి నీయెంగిలిమోవి చూపి
మరపుకోగాఁ బెట్టిమాటాడితినా
గరిమ నింతలో శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ గూడె
వొరసి నీవూఁ గూడఁగా నొడివట్టితినా
(||pallavi||)
nannu nela dūrevu naḍuma nīvu
yĕnnilevu nī vesālu yĕṁtaseseve
(||||)
salabaṭṭi nīvadani sādiṁchi nerubudo
valabiṁchugom̐gānu vaddaṁṭinā
mŏlaganavvulu navvi muṁdĕ yādanisittam̐
malara valabiṁcham̐gā naḍḍamu vachchidinā
(||||)
gŏṁṭaridanāna nīvu kŏṁguvaṭṭugŏni padim̐
niṁṭigi rappiṁchugogā nelaṁṭinā
jaṁpunīsannalanŏtti samaradulagum̐ dīsi
aṁṭi dakkam̐gŏnam̐gā nenaṁdugum̐ gādaṁṭinā
(||||)
iravuga nappaḍi nīyĕṁgilimovi sūbi
marabugogām̐ bĕṭṭimāḍāḍidinā
garima niṁtalo śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ gūḍĕ
vŏrasi nīvūm̐ gūḍam̐gā nŏḍivaṭṭidinā