నన్ను మీరఁ డాతఁడు నమ్మినదాన నేను
(॥పల్లవి॥)
నన్ను మీరఁ డాతఁడు నమ్మినదాన నేను
పన్నిన మాయల కేమీఁ బదరకువే
(॥నన్ను॥)
పాయము గడచనదు పంత మింతలోఁ దప్పదు
ఆయములు మోవ మాటలాడనీవే
చాయకాఁ డాతఁ డూరకే చల్లువల పేఁదైనా
చేయి నాచేఁ జిక్కినది చెలఁగనీవే
(॥నన్ను॥)
తలఁ పొకచో నుండదు తమి పండి పొల్లవోదు
నలువంక వారి తోడ నవ్వనీవే
సులభుఁ డాతఁడు తాను చూపుల పేరెలు వారు
నిలువెల్ల నాసొమ్ము నేరుచుకోనీవే
(॥నన్ను॥)
కోరికెకు గురిలేదు కొసరులు మీఁదువోదు
చేరి యందరితో నంటు సేయనీవే
అరయ శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
గారవించి నన్నుఁ గూడె కై కొననీవే
(||pallavi||)
nannu mīram̐ ḍādam̐ḍu namminadāna nenu
pannina māyala kemīm̐ badaraguve
(||nannu||)
pāyamu gaḍasanadu paṁta miṁtalom̐ dappadu
āyamulu mova māḍalāḍanīve
sāyagām̐ ḍādam̐ ḍūrage salluvala pem̐dainā
seyi nāsem̐ jikkinadi sĕlam̐ganīve
(||nannu||)
talam̐ pŏgaso nuṁḍadu tami paṁḍi pŏllavodu
naluvaṁka vāri toḍa navvanīve
sulabhum̐ ḍādam̐ḍu tānu sūbula perĕlu vāru
niluvĕlla nāsŏmmu nerusugonīve
(||nannu||)
korigĕgu guriledu kŏsarulu mīm̐duvodu
seri yaṁdarido naṁṭu seyanīve
araya śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
gāraviṁchi nannum̐ gūḍĕ kai kŏnanīve