Nannu maṟasi vumdunaa naa vibhumdu

నన్ను మఱచి వుండునా నా విభుఁడు
Language

(॥పల్లవి॥)
నన్ను మఱచి వుండునా నా విభుఁడు
యిన్నిటా నో చెలులాల మన్నీంచీఁ గాక

(॥నన్ను॥)
చలపట్టి పిలుతురా జాణఁడైన రమణుని
వలవు దెలిసి తానే వచ్చీఁగాక
యెలమిఁ గొసరుదురా యెదుట నిలుచుండగా
అలరి యాతఁడె మాటలాడీఁ గాక

(॥నన్ను॥)
సంగతిఁ గక్కసింతురా సరిగానుఁ జిక్కి తేను
యింగితాకారము తానే యెరీఁగీఁ గాక
చెంగటఁ బెనఁగుదురా చేతులెత్తి మొక్కితేను
కంగుదేర నన్నుఁ జూచి కరుణించీఁ గాక

(॥నన్ను॥)
సారెకు వేసరింతురా జంట వాయకుండఁగాను
గారవించి కాఁగిటఁ గలసీఁ గాక
ఆ రీతి శ్రీ వెంటేశుఁ డలమేల్ మంగను నేను
చేరి నన్ను నేలే నింకాఁ జిత్తగించీఁగాక

(||pallavi||)
nannu maṟasi vuṁḍunā nā vibhum̐ḍu
yinniḍā no sĕlulāla mannīṁchīm̐ gāga

(||nannu||)
salabaṭṭi piludurā jāṇam̐ḍaina ramaṇuni
valavu dĕlisi tāne vachchīm̐gāga
yĕlamim̐ gŏsarudurā yĕduḍa nilusuṁḍagā
alari yādam̐ḍĕ māḍalāḍīm̐ gāga

(||nannu||)
saṁgadim̐ gakkasiṁturā sarigānum̐ jikki tenu
yiṁgidāgāramu tāne yĕrīm̐gīm̐ gāga
sĕṁgaḍam̐ bĕnam̐gudurā sedulĕtti mŏkkidenu
kaṁgudera nannum̐ jūsi karuṇiṁchīm̐ gāga

(||nannu||)
sārĕgu vesariṁturā jaṁṭa vāyaguṁḍam̐gānu
gāraviṁchi kām̐giḍam̐ galasīm̐ gāga
ā rīdi śhrī vĕṁṭeśhum̐ ḍalamel maṁganu nenu
seri nannu nele niṁkām̐ jittagiṁchīm̐gāga