నన్ను మన్నించు మనవే నా యింటికి రమ్మనవే
(॥పల్లవి॥)
నన్ను మన్నించు మనవే నా యింటికి రమ్మనవే
యెన్నరాని చుట్టరికా లెంత లేదే తనకు
(॥॥)
పొరుగు పోరచివిందు పొసఁ గించుఁ జవు లెల్లా
తరి తీపుల మాటలు తమి రేఁచును
తెరమరఁగు సన్నలు తెగని యాసలు చూపు
యెరవులవారి పొందు లెంత లేదే తనకు
(॥॥)
సంగడి జాణతనాలు సరసము లాడించు
ముంగిటి నేస్తములు ముచ్చ టాడించు
అంగపు పెనఁగులాట లాయములు గరఁగించు
ఇంగితపు తాలపోఁత లెంత లేదే తనకు
(॥॥)
పుమ్మగిలుఁ బ్రియములు వుబ్బుఁ జెమటలు నించు
చిమ్ముఁ జూపులు మోములు చెంగలింపించు
కమ్మి శ్రీ వేంకటేశుఁడు గక్కనఁ దా నన్నుఁగూడె
యిమ్మల వినోదాలు యెంత లేదే తనకూ
(||pallavi||)
nannu manniṁchu manave nā yiṁṭigi rammanave
yĕnnarāni suṭṭarigā lĕṁta lede tanagu
(||||)
pŏrugu porasiviṁdu pŏsam̐ giṁchum̐ javu lĕllā
tari tībula māḍalu tami rem̐sunu
tĕramaram̐gu sannalu tĕgani yāsalu sūbu
yĕravulavāri pŏṁdu lĕṁta lede tanagu
(||||)
saṁgaḍi jāṇadanālu sarasamu lāḍiṁchu
muṁgiḍi nestamulu muchcha ṭāḍiṁchu
aṁgabu pĕnam̐gulāḍa lāyamulu garam̐giṁchu
iṁgidabu tālabom̐ta lĕṁta lede tanagu
(||||)
pummagilum̐ briyamulu vubbum̐ jĕmaḍalu niṁchu
simmum̐ jūbulu momulu sĕṁgaliṁpiṁchu
kammi śhrī veṁkaḍeśhum̐ḍu gakkanam̐ dā nannum̐gūḍĕ
yimmala vinodālu yĕṁta lede tanagū