నన్ను మన్నించె నాతఁడు నమ్మితి నేను
(॥పల్లవి॥)
నన్ను మన్నించె నాతఁడు నమ్మితి నేను
యెన్నికగా నిఁకఁ జెలు లేమీఁ జెప్పకురమ్మా
(॥॥)
అంకించి నే నాతని నట్టే వేఁడుకొనేఁ గాని
జంకించ నోపనమ్మా సారె సారెకు
మంకుదాన నౌదుఁగాని మనసు మోకదాకిరి(?)
కొంకక యేమి సేసినాఁ గోపగించ నమ్మా
(॥॥)
పొలసి విభుని తోడఁ బొందు సేయఁగలఁ గాని
అలుగనేర నమ్మా యెంతైనా నేను
చలమరి నౌదుఁగాని సాదించితి వినయము
చెలి నెందుండి వచ్చినా వెంగె మాడనమ్మా
(॥॥)
శ్రీ వేంకటేశుఁ గూడి సేవ సేయఁగలఁ గాని
కావరించ నొల్ల నమ్మా కాంతాళానను
లావరి నౌదుఁ గాని లలి సిగ్గు నాసొమ్ము
యీవల నన్నేలినాఁడు యెదిరించ నమ్మా
(||pallavi||)
nannu manniṁchĕ nādam̐ḍu nammidi nenu
yĕnnigagā nim̐kam̐ jĕlu lemīm̐ jĕppagurammā
(||||)
aṁkiṁchi ne nādani naṭṭe vem̐ḍugŏnem̐ gāni
jaṁkiṁcha nobanammā sārĕ sārĕgu
maṁkudāna naudum̐gāni manasu mogadāgiri(?)
kŏṁkaga yemi sesinām̐ gobagiṁcha nammā
(||||)
pŏlasi vibhuni toḍam̐ bŏṁdu seyam̐galam̐ gāni
aluganera nammā yĕṁtainā nenu
salamari naudum̐gāni sādiṁchidi vinayamu
sĕli nĕṁduṁḍi vachchinā vĕṁgĕ māḍanammā
(||||)
śhrī veṁkaḍeśhum̐ gūḍi seva seyam̐galam̐ gāni
kāvariṁcha nŏlla nammā kāṁtāḽānanu
lāvari naudum̐ gāni lali siggu nāsŏmmu
yīvala nannelinām̐ḍu yĕdiriṁcha nammā