నన్నెంత వొగడేవయ్యా నాగుణాలు మంచివంటా
(॥పల్లవి॥)
నన్నెంత వొగడేవయ్యా నాగుణాలు మంచివంటా
చిన్నదాన నే నీవు సేసిన మానిసిని
(॥॥)
తనుకుబాఁతియైన తరుణులెల్లా నింపులే
మనసెనసినవారిమాట లింపులే
నునుపు గలుగుచోటినవ్వులెల్లా నింపులే
పెనఁగి పైకొనేవారి ప్రియములు నింపులే
(॥॥)
సేవలు సేసేవారిసేఁ తలెల్లా నింపులే
కైవమైనవారిగతు లింపులే
వావిగలసినవారివాడికలెల్లా నింపులే
నీవద్దఁ బాయని వారినిండు సిగ్గు లింపులే
(॥॥)
సరసములాడే వారి సంగాతాలెల్ల నింపులే
సురతవేళల మేనిసోఁ కు లింపులే
ఇరవై శ్రీవెంకటేశ యిన్నిటా నన్నేలితివి
మరిగినయడాటాన మంతనము లింపులే
(||pallavi||)
nannĕṁta vŏgaḍevayyā nāguṇālu maṁchivaṁṭā
sinnadāna ne nīvu sesina mānisini
(||||)
tanugubām̐tiyaina taruṇulĕllā niṁpule
manasĕnasinavārimāḍa liṁpule
nunubu galugusoḍinavvulĕllā niṁpule
pĕnam̐gi paigŏnevāri priyamulu niṁpule
(||||)
sevalu sesevārisem̐ talĕllā niṁpule
kaivamainavārigadu liṁpule
vāvigalasinavārivāḍigalĕllā niṁpule
nīvaddam̐ bāyani vāriniṁḍu siggu liṁpule
(||||)
sarasamulāḍe vāri saṁgādālĕlla niṁpule
suradaveḽala menisom̐ ku liṁpule
iravai śhrīvĕṁkaḍeśha yinniḍā nannelidivi
mariginayaḍāḍāna maṁtanamu liṁpule