నన్నెంత వేఁడుకొనేవు నయాన నీవు
(॥పల్లవి॥)
నన్నెంత వేఁడుకొనేవు నయాన నీవు
మన్నింపించుకొన్నదాన మరిగించేఁగాక
(॥నన్నెం॥)
వెగటై యేమిసేసినా వెంగెమాడేనా నిన్ను
మొగమోట గలదాన మొక్కేఁగాక
నిగిడి యెంత మిరినా నీతో మారుమలసేనా
తగులు గలవానను దక్కివుందుఁగాక
(॥నన్నెం॥)
యెత్తలనుండి వచ్చినా నెగ్గుపట్టేనా నిన్ను
చిత్తములోదాన సేవసేసేఁగాక
బత్తి యెందుఁగలిగినా పదరిపాదించేనా
హత్తుగడైవున్నదాన నట్టె మెచ్చేఁగాక
(॥నన్నెం॥)
సందడివలపు లెంత చల్లుకొనివున్నా నిన్ను
పొందైవున్నదానఁ దమివుట్టించేఁ గాక
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కందువైనదాన నీకు గళరేఁచేఁగాక
(||pallavi||)
nannĕṁta vem̐ḍugŏnevu nayāna nīvu
manniṁpiṁchugŏnnadāna marigiṁchem̐gāga
(||nannĕṁ||)
vĕgaḍai yemisesinā vĕṁgĕmāḍenā ninnu
mŏgamoḍa galadāna mŏkkem̐gāga
nigiḍi yĕṁta mirinā nīdo mārumalasenā
tagulu galavānanu dakkivuṁdum̐gāga
(||nannĕṁ||)
yĕttalanuṁḍi vachchinā nĕggubaṭṭenā ninnu
sittamulodāna sevasesem̐gāga
batti yĕṁdum̐galiginā padaribādiṁchenā
hattugaḍaivunnadāna naṭṭĕ mĕchchem̐gāga
(||nannĕṁ||)
saṁdaḍivalabu lĕṁta sallugŏnivunnā ninnu
pŏṁdaivunnadānam̐ damivuṭṭiṁchem̐ gāga
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
kaṁduvainadāna nīgu gaḽarem̐sem̐gāga