నన్నేమి యడిగీనే నాయకుఁడు నాకుఁ దాను
(॥పల్లవి॥)
నన్నేమి యడిగీనే నాయకుఁడు నాకుఁ దాను
సన్నలఁ దన్ను దిద్దుక చాయకు దే వసమా
(॥నన్నే॥)
వూరఁ జుట్టమైనవాఁడు వొదిగి వుండఁగనేలే
ధీరత యిండ్లవెంట్లఁ దిరుగుఁగాక
జీరదీయించుకొన్నాఁడు సిగ్గులువడఁగనేలే
వొరలేనివలపుల కొడిగట్టుఁ గాక
(॥నన్నే॥)
ఆసలు వెట్టినవాఁడు అనుమానించఁగనేలే
సేసవెట్టించు కందరిఁ జెనకుఁగాక
బాసలిచ్చినాఁడు ఇంకాఁ బంతాలు నెరపనేలే
వేసాలు మాని విచ్చనవిడి నుండుఁగాక
(॥నన్నే॥)
వేడుకపడినవాఁడు వెఱపు మఱపులేలే
వాడిక కిందరి గూడి వచ్చుఁగాక
యీడనె శ్రీవేంకటేశుఁడేలినాడు నన్ను నేఁడు
తోడఁ దోడ రతులకు దొరకొనుఁగాక
(||pallavi||)
nannemi yaḍigīne nāyagum̐ḍu nāgum̐ dānu
sannalam̐ dannu didduga sāyagu de vasamā
(||nanne||)
vūram̐ juṭṭamainavām̐ḍu vŏdigi vuṁḍam̐ganele
dhīrada yiṁḍlavĕṁṭlam̐ dirugum̐gāga
jīradīyiṁchugŏnnām̐ḍu sigguluvaḍam̐ganele
vŏralenivalabula kŏḍigaṭṭum̐ gāga
(||nanne||)
āsalu vĕṭṭinavām̐ḍu anumāniṁcham̐ganele
sesavĕṭṭiṁchu kaṁdarim̐ jĕnagum̐gāga
bāsalichchinām̐ḍu iṁkām̐ baṁtālu nĕrabanele
vesālu māni vichchanaviḍi nuṁḍum̐gāga
(||nanne||)
veḍugabaḍinavām̐ḍu vĕṟabu maṟabulele
vāḍiga kiṁdari gūḍi vachchum̐gāga
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ḍelināḍu nannu nem̐ḍu
toḍam̐ doḍa radulagu dŏragŏnum̐gāga