నన్నేల యెచ్చరించేరే నాకు మఱపు గలదా
(॥పల్లవి॥)
నన్నేల యెచ్చరించేరే నాకు మఱపు గలదా
పన్ని యింతమాత్రానకు పదరఁగనేలే
(॥నన్నే॥)
కందువ లంటినప్పుడే గక్కనఁ జెనకేఁగాక
సందడిలో వలపులు చల్లనేలే
విందువలెఁ బిలిచితే వేడుక నూఁకొనేఁగాక
అందరివలెనే మాటలట్టెయాడనేలే
(॥నన్నే॥)
వలెనన్నప్పుడు నేనే వచ్చేఁగాక వద్దికి
కొలువులోపలఁ బతిఁ గొసరనేలే
నెలకొన్నప్పుడే తన నేరుపులు మెచ్చేఁగాక
పొలసితేఁ బేరుకొని పొగడగనేలే
(॥నన్నే॥)
నగినప్పుడే మలు నాఁటఁ బొడగనేఁగాక
మొగము వంచుకుండఁగా మొక్కనేలే
పగటున శ్రీవేంకటపతి తానే నన్నుఁ గూడె
అగడుసేసి రతుల నలయించనేలే
(||pallavi||)
nannela yĕchchariṁchere nāgu maṟabu galadā
panni yiṁtamātrānagu padaram̐ganele
(||nanne||)
kaṁduva laṁṭinappuḍe gakkanam̐ jĕnagem̐gāga
saṁdaḍilo valabulu sallanele
viṁduvalĕm̐ biliside veḍuga nūm̐kŏnem̐gāga
aṁdarivalĕne māḍalaṭṭĕyāḍanele
(||nanne||)
valĕnannappuḍu nene vachchem̐gāga vaddigi
kŏluvulobalam̐ badim̐ gŏsaranele
nĕlagŏnnappuḍe tana nerubulu mĕchchem̐gāga
pŏlasidem̐ berugŏni pŏgaḍaganele
(||nanne||)
naginappuḍe malu nām̐ṭam̐ bŏḍaganem̐gāga
mŏgamu vaṁchuguṁḍam̐gā mŏkkanele
pagaḍuna śhrīveṁkaḍabadi tāne nannum̐ gūḍĕ
agaḍusesi radula nalayiṁchanele