నన్నేల యసపెట్టేవు నాయకునిమీఁదను
(॥పల్లవి॥)
నన్నేల యసపెట్టేవు నాయకునిమీఁదను
పిన్నదాన ఆతనికిఁ బ్రియమాడేదానను
(॥నన్నే॥)
పెలుచుమాటదానవు పెద్దాలవు
అలరి నీవే యతని ననవమ్మా
వలచినదాన నేను వద్దనుండేదానను
పిలువనేరుతుఁ గాని బిగియఁగనేరను
(॥నన్నే॥)
చనవరిదానవు చలమరిదానవు
చెనకి నీవేమైనాఁ జేయవమ్మా
ననిచినదాన నేను నయగారిదానను
వినయమే నేరుఁగాని వేసరించనేరను
(॥నన్నే॥)
తగవరి దానవు తమకపు దానవు
సొగిసి నీవే దయఁజూడవమ్మా
మొగమోటదానను ముంచి శ్రీవేంకటేశుఁడు
జిగిఁ గూడె బొంకనేర చెంగలించనేర్తును
(||pallavi||)
nannela yasabĕṭṭevu nāyagunimīm̐danu
pinnadāna ādanigim̐ briyamāḍedānanu
(||nanne||)
pĕlusumāḍadānavu pĕddālavu
alari nīve yadani nanavammā
valasinadāna nenu vaddanuṁḍedānanu
piluvanerudum̐ gāni bigiyam̐ganeranu
(||nanne||)
sanavaridānavu salamaridānavu
sĕnagi nīvemainām̐ jeyavammā
nanisinadāna nenu nayagāridānanu
vinayame nerum̐gāni vesariṁchaneranu
(||nanne||)
tagavari dānavu tamagabu dānavu
sŏgisi nīve dayam̐jūḍavammā
mŏgamoḍadānanu muṁchi śhrīveṁkaḍeśhum̐ḍu
jigim̐ gūḍĕ bŏṁkanera sĕṁgaliṁchanerdunu