నన్నేల పిలిచేవు నగుతా నాపె యింటికి
(॥పల్లవి॥)
నన్నేల పిలిచేవు నగుతా నాపె యింటికి
విన్న సుద్దులే చాలు వేడుకాయ నాకును
(॥నన్నే॥)
సరుసఁ గూచుండి యాపె సారె నిన్ను జంకించఁగా
విరులనుఁ బూఁచి పూఁచి వేయఁగాను
తురుము కొనగోళ్లను దువ్వి దువ్వి తియ్యఁగాను
నిరతి నివెల్లాఁ జూచి నే నోరువఁ గలనా
(॥నన్నే॥)
తొడమీఁద దొడ వేసి దొరతనాలు చూపఁగా
కడఁగి నీమోవి యాకె గంకి సేయఁగా
గుది(డి?) గొన రాకొట్లు గొట్టి నిన్నుఁ బిలువఁగా
వొడఁబడి నోనిందుకు వోరువఁగఁగలనా
(॥నన్నే॥)
చనుమొనలు నాఁటించి సదమదము సేయఁగా
పెనఁగులాడి నీమేను పిప్పిసేయఁగా
ననిచి శ్రీవేంకటేశ నాకాఁగిట నీవుండఁగా
వొనరి యాపె చేఁతల కోరువఁగఁగలనా
(||pallavi||)
nannela pilisevu nagudā nābĕ yiṁṭigi
vinna suddule sālu veḍugāya nāgunu
(||nanne||)
sarusam̐ gūsuṁḍi yābĕ sārĕ ninnu jaṁkiṁcham̐gā
virulanum̐ būm̐si pūm̐si veyam̐gānu
turumu kŏnagoḽlanu duvvi duvvi tiyyam̐gānu
niradi nivĕllām̐ jūsi ne noruvam̐ galanā
(||nanne||)
tŏḍamīm̐da dŏḍa vesi dŏradanālu sūbam̐gā
kaḍam̐gi nīmovi yāgĕ gaṁki seyam̐gā
gudi(ḍi?) gŏna rāgŏṭlu gŏṭṭi ninnum̐ biluvam̐gā
vŏḍam̐baḍi noniṁdugu voruvam̐gam̐galanā
(||nanne||)
sanumŏnalu nām̐ṭiṁchi sadamadamu seyam̐gā
pĕnam̐gulāḍi nīmenu pippiseyam̐gā
nanisi śhrīveṁkaḍeśha nāgām̐giḍa nīvuṁḍam̐gā
vŏnari yābĕ sem̐tala koruvam̐gam̐galanā