Nanne ṟattu seduru naduma meeru

నన్నే ఱట్టు సేతురు నడుమ మీరు
Language

(॥పల్లవి॥)
నన్నే ఱట్టు సేతురు నడుమ మీరు
కన్నుల నిద్దుర దేరీఁ గంటిరటే చెలులు

(॥॥)
చెప్పనా నే నప్పుడే చిత్తిణివాఁ డితఁడని
చిప్పిల నెందో పొందు సేసి వచ్చెను
దప్పి దేరీఁ గెమ్మోవి తనువెల్లాఁ జెమటలే
చొప్పులెల్లను మీరే చూడరమ్మ చెలులు

(॥॥)
చూపనా నే నపుడే జూటరివాఁ డితఁడని
దాపుగా మైగుఱుతులు దాఁచుకొనెను
యేపొద్దూ నిదేపని యెమ్మెలే నిలువెల్లా
కోపుల నిన్నీఁ దెలుసుకొనరమ్మ చెలులు

(॥॥)
యెంచనా నేనపుడే యిచ్చకుఁడు యీతఁడని
పొంచి శ్రీ వేంకటేశుఁడు పొందెను నన్ను
వంచనలు నేరుచును వలపులే సుద్దులెల్లా
మించి నిన్నిటా మీరు మెచ్చరమ్మ చెలులు

(||pallavi||)
nanne ṟaṭṭu seduru naḍuma mīru
kannula niddura derīm̐ gaṁṭiraḍe sĕlulu

(||||)
sĕppanā ne nappuḍe sittiṇivām̐ ḍidam̐ḍani
sippila nĕṁdo pŏṁdu sesi vachchĕnu
dappi derīm̐ gĕmmovi tanuvĕllām̐ jĕmaḍale
sŏppulĕllanu mīre sūḍaramma sĕlulu

(||||)
sūbanā ne nabuḍe jūḍarivām̐ ḍidam̐ḍani
dābugā maiguṟudulu dām̐sugŏnĕnu
yebŏddū nidebani yĕmmĕle niluvĕllā
kobula ninnīm̐ dĕlusugŏnaramma sĕlulu

(||||)
yĕṁchanā nenabuḍe yichchagum̐ḍu yīdam̐ḍani
pŏṁchi śhrī veṁkaḍeśhum̐ḍu pŏṁdĕnu nannu
vaṁchanalu nerusunu valabule suddulĕllā
miṁchi ninniḍā mīru mĕchcharamma sĕlulu