Nanisi yaadanidone naguda numdedamgaaga

ననిచి యాతనితోనే నగుత నుండెదఁగాక
Language

(॥పల్లవి॥)
ననిచి యాతనితోనే నగుత నుండెదఁగాక
చనవు గలిగినవెనక జరయఁదగు నటవే

(॥నని॥)
భావ మాతని మీఁదఁ బాదుకొలిపినవెనక
చెవదేరఁగ నలుగఁ జెల్లునటవే
కావరపువలపు లొడిఁగట్టుకుండిన వెనక
వావాతమచ్చికలు పదలఁదగునటవే

(॥నని॥)
మిగుల నతనికి మోవి మీఁదుకట్టిన వెనక
జిగిమించి ఇఁకఁ బలుకఁ జెల్లునటవే
పగటుతో వయసు తనపాలఁ బెట్టినవెనక
మగిడి మొగమోట లటు మానెందగ నటవే

(॥నని॥)
లవి భోగ మతనితో లంకెసేసిన వెనక
చెలిమి సేయక మరవఁజెల్లునటవే
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో ననుఁగూడె
వెలలేనితమక మిఁక విడవఁదగునటవే

(||pallavi||)
nanisi yādanidone naguda nuṁḍĕdam̐gāga
sanavu galiginavĕnaga jarayam̐dagu naḍave

(||nani||)
bhāva mādani mīm̐dam̐ bādugŏlibinavĕnaga
sĕvaderam̐ga nalugam̐ jĕllunaḍave
kāvarabuvalabu lŏḍim̐gaṭṭuguṁḍina vĕnaga
vāvādamachchigalu padalam̐dagunaḍave

(||nani||)
migula nadanigi movi mīm̐dugaṭṭina vĕnaga
jigimiṁchi im̐kam̐ balugam̐ jĕllunaḍave
pagaḍudo vayasu tanabālam̐ bĕṭṭinavĕnaga
magiḍi mŏgamoḍa laḍu mānĕṁdaga naḍave

(||nani||)
lavi bhoga madanido laṁkĕsesina vĕnaga
sĕlimi seyaga maravam̐jĕllunaḍave
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo nanum̐gūḍĕ
vĕlalenidamaga mim̐ka viḍavam̐dagunaḍave