ననిచి పదివేలకు నావాఁడే తాను
(॥పల్లవి॥)
ననిచి పదివేలకు నావాఁడే తాను
వినయానఁ దనకిట్టె విన్నవించరే
(॥నని॥)
యెక్కడఁదా నుండినాను యెదలోఁ దలఁతు నేను
మొక్కలాన మఱచున్నా మొక్కుదు నేను
యిక్కువ లంటకుండితే యెచ్చరిక సేతు నేను
పక్కన తన్నుఁ దప్పులుపట్టేనా నేను
(॥నని॥)
యెంతవొద్దు రాకుండినా నెదురులుచూతు నేను
చెంతనుండి పరాకైతే చేచాఁతు నేను
వింతవారితో నవ్వితే వేడుకతో మెత్తు నేను
యెంతైనాఁ నిన్ను నేరములెంచేనా నేను
(॥నని॥)
పవళించి వుండితేను పాదాలు గుద్దుదు నేను
అవలిమోమై యుంటే మాటాడుచు నేను
ఇవల శ్రీవేంకటేశుఁ డీతఁడిట్టె నన్ను నేలె
తివిరి తనగుణాలు దిద్దేనా నేను
(||pallavi||)
nanisi padivelagu nāvām̐ḍe tānu
vinayānam̐ danagiṭṭĕ vinnaviṁchare
(||nani||)
yĕkkaḍam̐dā nuṁḍinānu yĕdalom̐ dalam̐tu nenu
mŏkkalāna maṟasunnā mŏkkudu nenu
yikkuva laṁṭaguṁḍide yĕchchariga sedu nenu
pakkana tannum̐ dappulubaṭṭenā nenu
(||nani||)
yĕṁtavŏddu rāguṁḍinā nĕdurulusūdu nenu
sĕṁtanuṁḍi parāgaide sesām̐tu nenu
viṁtavārido navvide veḍugado mĕttu nenu
yĕṁtainām̐ ninnu neramulĕṁchenā nenu
(||nani||)
pavaḽiṁchi vuṁḍidenu pādālu guddudu nenu
avalimomai yuṁṭe māḍāḍusu nenu
ivala śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍiṭṭĕ nannu nelĕ
tiviri tanaguṇālu diddenā nenu