Nanisi neemaadalu nammidi nenu

ననిచి నీమాటలు నమ్మితి నేను
Language

(॥పల్లవి॥)
ననిచి నీమాటలు నమ్మితి నేను
చెనకనేమిటికి నీ చిత్తము నా భాగ్యము

(॥॥)
యెంచిచూచితేఁ గోరిక లెంతైనాఁ గలవు
అంచెఁ గడువలచినయట్టివారికి
పెంచి నాతమకము పిక్కటిల్లె యీమనసు
చించిచెప్పరాదు నీ చిత్తము నాభాగ్యము

(॥॥)
సేయించుకొంటే బాసలు చేటలకొలఁదులు
చాయలఁ బొందులుసేసేసరసులకు
పాయరానిజవ్వనము పట్టరాదు కానికెగా
చేయెత్తి మొక్కేను నీచిత్తము నాభాగ్యము

(॥॥)
కుమ్మరించితే రతులు కోటానఁగోట్లు
నెమ్మనము గలిసిన నీకు నాకును
ఇమ్ముల శ్రీవేంకటేశ ఇఁక నీపై సిగ్గు గొంత
చిమ్మరాదు సారెకు నీచిత్తము నాభాగ్యము

(||pallavi||)
nanisi nīmāḍalu nammidi nenu
sĕnaganemiḍigi nī sittamu nā bhāgyamu

(||||)
yĕṁchisūsidem̐ goriga lĕṁtainām̐ galavu
aṁchĕm̐ gaḍuvalasinayaṭṭivārigi
pĕṁchi nādamagamu pikkaḍillĕ yīmanasu
siṁchisĕpparādu nī sittamu nābhāgyamu

(||||)
seyiṁchugŏṁṭe bāsalu seḍalagŏlam̐dulu
sāyalam̐ bŏṁdulusesesarasulagu
pāyarānijavvanamu paṭṭarādu kānigĕgā
seyĕtti mŏkkenu nīsittamu nābhāgyamu

(||||)
kummariṁchide radulu koḍānam̐goṭlu
nĕmmanamu galisina nīgu nāgunu
immula śhrīveṁkaḍeśha im̐ka nībai siggu gŏṁta
simmarādu sārĕgu nīsittamu nābhāgyamu