ననిచి మరీఁ గొంత నవ్వేవు గాక
(॥పల్లవి॥)
ననిచి మరీఁ గొంత నవ్వేవు గాక
కొనముట్ట నేము నీతోఁ గోపగించేమా
(॥నని॥)
చనవు సేసుక నీతో సారె సారె నవ్వితేను
కనలి తప్పక చూచి కాఁతాళించేవు
పెనఁగి నీవింతేసి బిరుదు లెక్కించుకొంటే
వనితలమింతే నీతో వాదులాడేమా
(॥నని॥)
కాయము పైఁ జేయివేసి కందువ లంటితేను
ఆయములు సోఁక నాతో నానవెట్టేవు
చాయలకు నీవింత చలము సాదించితేను
పాయపు వారము నేము పంగించేమా
(॥నని॥)
నేరుపున నిన్నుఁ గూడి నివ్వెరగు నొందితేను
గోరికొన నెచ్చరించి గురి సే సేవు
యీరీతి శ్రీ వేంకటేశ యెంత పంతమాడినాను
మేరతోడి వారము మితిమీరేమా
(||pallavi||)
nanisi marīm̐ gŏṁta navvevu gāga
kŏnamuṭṭa nemu nīdom̐ gobagiṁchemā
(||nani||)
sanavu sesuga nīdo sārĕ sārĕ navvidenu
kanali tappaga sūsi kām̐tāḽiṁchevu
pĕnam̐gi nīviṁtesi birudu lĕkkiṁchugŏṁṭe
vanidalamiṁte nīdo vādulāḍemā
(||nani||)
kāyamu paim̐ jeyivesi kaṁduva laṁṭidenu
āyamulu som̐ka nādo nānavĕṭṭevu
sāyalagu nīviṁta salamu sādiṁchidenu
pāyabu vāramu nemu paṁgiṁchemā
(||nani||)
nerubuna ninnum̐ gūḍi nivvĕragu nŏṁdidenu
gorigŏna nĕchchariṁchi guri se sevu
yīrīdi śhrī veṁkaḍeśha yĕṁta paṁtamāḍinānu
meradoḍi vāramu midimīremā