Namtunam ganagagiri naarasimhaa

నంటునఁ గనకగిరి నారసింహా
Language

(॥పల్లవి॥)
నంటునఁ గనకగిరి నారసింహా
వెంట వెంట నాకుఁగానే వేడుకపడేవు

(॥నంటు॥)
చేముట్టి కొలువులోన సిగ్గు విచారించక
నామేను చెన కేవు నడుమ నీవు
కామినులు వసంతము కడు నీపైఁ జల్లరాఁగా
ప్రేమ నాపయ్యదలోనఁ బెనఁగి దాఁగేవు

(॥నంటు॥)
వొద్దనుండి చెలులెల్లా నూడిగాలు సేయఁగానే
అద్దుక నాతో నవ్వే వప్పటి నీవు
వుద్దంటాన మేనవారు వొడివట్టి తియ్యఁగానే
గద్దరితనాన నన్నుఁ గాఁగిలించుకొనేవు

(॥నంటు॥)
సంగతి విచారంచక సరిఁ బొరుగువారింట
యెంగిలిసేసేవు మోవి ఇప్పుడే నీవు
చెంగట శ్రీవేంకటేశ జిగిఁ బేరటాండ్లు చూడ
చెంగలించి నామీఁద సేసలువెట్టేవు

(||pallavi||)
naṁṭunam̐ ganagagiri nārasiṁhā
vĕṁṭa vĕṁṭa nāgum̐gāne veḍugabaḍevu

(||naṁṭu||)
semuṭṭi kŏluvulona siggu visāriṁchaga
nāmenu sĕna kevu naḍuma nīvu
kāminulu vasaṁtamu kaḍu nībaim̐ jallarām̐gā
prema nābayyadalonam̐ bĕnam̐gi dām̐gevu

(||naṁṭu||)
vŏddanuṁḍi sĕlulĕllā nūḍigālu seyam̐gāne
adduga nādo navve vappaḍi nīvu
vuddaṁṭāna menavāru vŏḍivaṭṭi tiyyam̐gāne
gaddaridanāna nannum̐ gām̐giliṁchugŏnevu

(||naṁṭu||)
saṁgadi visāraṁchaga sarim̐ bŏruguvāriṁṭa
yĕṁgilisesevu movi ippuḍe nīvu
sĕṁgaḍa śhrīveṁkaḍeśha jigim̐ beraḍāṁḍlu sūḍa
sĕṁgaliṁchi nāmīm̐da sesaluvĕṭṭevu