Namtuna remdu vidhaalu nadabeem daanu

నంటున రెండు విధాలు నడపీఁ దాను
Language

(॥పల్లవి॥)
నంటున రెండు విధాలు నడపీఁ దాను
జంటచుట్టమైనవాఁడు సారె నేఁచ నేఁటికే

(॥నంటు॥)
నాతో మాటలాడి ఇట్టే ననుపు సేసినవాడు
యేతుల నెవ్వతెఇంటి కేఁగఁ నేలే
చేతికి లో నైన వాఁడు సేవగొనుఁగాక తాను
కాతరానఁ బరాకులుగాఁ దనకేఁటికే

(॥నంటు॥)
నామోము చూచి నేఁడు నవ్వులు నవ్వినవాఁడు
వేమారు విన్నపాలు వినఁగనేలే
కామించి నావద్దికి గక్కున వచ్చినవాఁడు
చేముట్టి సంగడివారిఁ జెనకఁగ నేఁటికే

(॥నంటు॥)
గట్టిగా నన్నుఁ గాఁగిటఁ గలసినయట్టివాఁడు
ఱట్టు సేసి యొకతె కాఱడి గానేలే
ఇట్టె శ్రీ వేంకటేశుఁ డీతఁడే నన్ను మన్నించె
గుట్టుతోడ నేమిటికిఁ గొంక నిఁక నేఁటికే

(||pallavi||)
naṁṭuna rĕṁḍu vidhālu naḍabīm̐ dānu
jaṁṭasuṭṭamainavām̐ḍu sārĕ nem̐sa nem̐ṭige

(||naṁṭu||)
nādo māḍalāḍi iṭṭe nanubu sesinavāḍu
yedula nĕvvadĕiṁṭi kem̐gam̐ nele
sedigi lo naina vām̐ḍu sevagŏnum̐gāga tānu
kādarānam̐ barāgulugām̐ danagem̐ṭige

(||naṁṭu||)
nāmomu sūsi nem̐ḍu navvulu navvinavām̐ḍu
vemāru vinnabālu vinam̐ganele
kāmiṁchi nāvaddigi gakkuna vachchinavām̐ḍu
semuṭṭi saṁgaḍivārim̐ jĕnagam̐ga nem̐ṭige

(||naṁṭu||)
gaṭṭigā nannum̐ gām̐giḍam̐ galasinayaṭṭivām̐ḍu
ṟaṭṭu sesi yŏgadĕ kāṟaḍi gānele
iṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu manniṁchĕ
guṭṭudoḍa nemiḍigim̐ gŏṁka nim̐ka nem̐ṭige