నంటున నెవ్వతెతోనో నవ్వెనంటాను
(॥పల్లవి॥)
నంటున నెవ్వతెతోనో నవ్వెనంటాను
జంటవాయ కెంతేసి సాదించేవే
(॥నంటు॥)
చిగురువంటిది మోవి చిలుకపలుకు మాట
వెగటు లే కే లతని వెంగె మాడేవే
మొగము తమ్మివంటిది ముద్దుఁజెక్కు లద్దములు
అగడుసేసి నీవెంత అద్దలించేవే
(॥నంటు॥)
కలువలే నీకన్నులు కారుమెరుఁగులే చూపు
చలపట్టి నీవెంత జంకించేవే
లలిఁ దీగెలు చేతులు లావణ్యము నీమేను
పెలుచు దనాన నెంత పెనఁగులాడేవే
(॥నంటు॥)
పూవుఁబంతులు కన్నులు పులినాలు పిరుఁదులు
శ్రీవేంకటేశ్వరు నేమి చిమ్మిరేఁచేవే
వేవేగ నిన్నితఁడేలె వెలసె నీజవ్వనము
లావుగాఁ గాఁగిటు నెంత లంకించేవే
(||pallavi||)
naṁṭuna nĕvvadĕdono navvĕnaṁṭānu
jaṁṭavāya kĕṁtesi sādiṁcheve
(||naṁṭu||)
siguruvaṁṭidi movi silugabalugu māḍa
vĕgaḍu le ke ladani vĕṁgĕ māḍeve
mŏgamu tammivaṁṭidi muddum̐jĕkku laddamulu
agaḍusesi nīvĕṁta addaliṁcheve
(||naṁṭu||)
kaluvale nīgannulu kārumĕrum̐gule sūbu
salabaṭṭi nīvĕṁta jaṁkiṁcheve
lalim̐ dīgĕlu sedulu lāvaṇyamu nīmenu
pĕlusu danāna nĕṁta pĕnam̐gulāḍeve
(||naṁṭu||)
pūvum̐baṁtulu kannulu pulinālu pirum̐dulu
śhrīveṁkaḍeśhvaru nemi simmirem̐seve
vevega ninnidam̐ḍelĕ vĕlasĕ nījavvanamu
lāvugām̐ gām̐giḍu nĕṁta laṁkiṁcheve