Namtuna nee megulagu navvenayyaa

నంటున నీ మేకులకు నవ్వేనయ్యా
Language

(॥పల్లవి॥)
నంటున నీ మేకులకు నవ్వేనయ్యా
దంటనైతి నీ యెడకు తమక మేలయ్యా

(॥నంటు॥)
చూపులనే తనిసితి సుద్దులనే చేలఁగితి
యీపొద్దు నాతోఁ బెనగే విదేమయ్యా
వోపిక నీకుఁ గలదు వొరయఁగరాదు నిన్ను
తీపులాయ నామోవి తెగువలేలయ్యా

(॥నంటు॥)
మాటలనే భ్రమసితి మచ్చికలనే చొక్కితి
యేటికి నన్ను గొసరే విదేమయ్యా
నీటుకాఁడ వౌదువు నిన్ను వదలఁగరాదు
వాటమాయ తలపోత వంచనలేలయ్యా

(॥నంటు॥)
రతుల నోలలాడితి రాజసాన బెరిగితి
యితవు నన్నడిగేవు యిదేమయ్యా
పతివి శ్రీవేంకటేశ పైపైఁ గూడితివి నన్ను
కతలాయ నామోహము కాదననేలయ్యా

(||pallavi||)
naṁṭuna nī megulagu navvenayyā
daṁṭanaidi nī yĕḍagu tamaga melayyā

(||naṁṭu||)
sūbulane tanisidi suddulane selam̐gidi
yībŏddu nādom̐ bĕnage videmayyā
vobiga nīgum̐ galadu vŏrayam̐garādu ninnu
tībulāya nāmovi tĕguvalelayyā

(||naṁṭu||)
māḍalane bhramasidi machchigalane sŏkkidi
yeḍigi nannu gŏsare videmayyā
nīḍugām̐ḍa vauduvu ninnu vadalam̐garādu
vāḍamāya talaboda vaṁchanalelayyā

(||naṁṭu||)
radula nolalāḍidi rājasāna bĕrigidi
yidavu nannaḍigevu yidemayyā
padivi śhrīveṁkaḍeśha paibaim̐ gūḍidivi nannu
kadalāya nāmohamu kādananelayyā