నంటున నాతని చేఁతో నా వోజ ఇట్లాయనో
(॥పల్లవి॥)
నంటున నాతని చేఁతో నా వోజ ఇట్లాయనో
కంటిరా వోచెలులాల కారుకమ్మీ వలపు
(॥నంటు॥)
సిగ్గుల మాటలాడితే చిరునవ్వు వచ్చుఁగాక
కగ్గి మతిఁ గోపముకాఁ గారణమేమే
అగ్గలమై చెనకితే నాస వుట్టవలెఁ గాక
యెగ్గుపట్టి బొమముడి యేల పొంచీనే
(॥నంటు॥)
చేరి పెనఁగులాడితే చెమటలు రేఁగుఁగాక
పోరచి మెయికాఁకలు పొడమనేలే
సారెఁ దప్పక చూచితే సంతోసించవలెఁ గాక
మారుకొన్న పంతములు మలయఁగ నేఁటికే
(॥నంటు॥)
తతిఁ గూడితే రతిఁ దనివందవలెఁ గాక
మితిలేని తమకము మెరయనేలే
అతఁడు శ్రీవెంకటేశుఁ డలమేల్‌మంగను నేను
చతురతఁ గూడితిమి చల మిఁక నేఁటికే
(||pallavi||)
naṁṭuna nādani sem̐to nā voja iṭlāyano
kaṁṭirā vosĕlulāla kārugammī valabu
(||naṁṭu||)
siggula māḍalāḍide sirunavvu vachchum̐gāga
kaggi madim̐ gobamugām̐ gāraṇameme
aggalamai sĕnagide nāsa vuṭṭavalĕm̐ gāga
yĕggubaṭṭi bŏmamuḍi yela pŏṁchīne
(||naṁṭu||)
seri pĕnam̐gulāḍide sĕmaḍalu rem̐gum̐gāga
porasi mĕyigām̐kalu pŏḍamanele
sārĕm̐ dappaga sūside saṁtosiṁchavalĕm̐ gāga
mārugŏnna paṁtamulu malayam̐ga nem̐ṭige
(||naṁṭu||)
tadim̐ gūḍide radim̐ danivaṁdavalĕm̐ gāga
midileni tamagamu mĕrayanele
adam̐ḍu śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
saduradam̐ gūḍidimi sala mim̐ka nem̐ṭige