నంటు చేసీ సిరితోడ నరసింహుఁడు
(॥పల్లవి॥)
నంటు చేసీ సిరితోడ నరసింహుఁడు
జంట సరసములాడీ సారె నరసింహుఁడు
(॥॥)
జవ్వనిఁ దనతొడపై సంతసాన నిడుకొని
నవ్వులు నవ్వీనిదె నరసింహుఁడు
నివ్వటిల్లుఁ జూపులు నెలఁతచన్నులమీఁద
కువ్వనిపేరులవలెఁ గుచ్చీ నరసింహుఁడు
(॥॥)
ఆయంగనఁ గాఁగిట నలమి మోవి యొసగి
నాయములు నడపీ నరసింహుఁడు
కాయముపైఁ దొరిగేటి కస్తూరి చెమటలు
పూయని పూఁతలువలెఁ బూసీ నరసింహుఁడు
(॥॥)
కూరిమి పట్టపుదేవిఁ గూడి శ్రీవేంకటేశుఁడై
నారు వోసీఁ బులకలు నరసింహుఁడు
వారకానఁ బ్రహ్లద వరదుఁడు మరుముద్ర-
లూరట సొమ్ములుగాఁగ నుంచీ నరసింహుఁడు
(||pallavi||)
naṁṭu sesī siridoḍa narasiṁhum̐ḍu
jaṁṭa sarasamulāḍī sārĕ narasiṁhum̐ḍu
(||||)
javvanim̐ danadŏḍabai saṁtasāna niḍugŏni
navvulu navvīnidĕ narasiṁhum̐ḍu
nivvaḍillum̐ jūbulu nĕlam̐tasannulamīm̐da
kuvvaniberulavalĕm̐ guchchī narasiṁhum̐ḍu
(||||)
āyaṁganam̐ gām̐giḍa nalami movi yŏsagi
nāyamulu naḍabī narasiṁhum̐ḍu
kāyamubaim̐ dŏrigeḍi kastūri sĕmaḍalu
pūyani pūm̐taluvalĕm̐ būsī narasiṁhum̐ḍu
(||||)
kūrimi paṭṭabudevim̐ gūḍi śhrīveṁkaḍeśhum̐ḍai
nāru vosīm̐ bulagalu narasiṁhum̐ḍu
vāragānam̐ brahlada varadum̐ḍu marumudra-
lūraḍa sŏmmulugām̐ga nuṁchī narasiṁhum̐ḍu