నమ్ముదురు యిఁక నిన్ను నలినాక్షులు
(॥పల్లవి॥)
నమ్ముదురు యిఁక నిన్ను నలినాక్షులు
వుమ్మడి నింకానేల వొడఁబరచేవు
(॥నమ్ము॥)
వేడుకకాఁడవైతివి విచ్చి విచ్చి ఆపె నాతో-
నాడినన్నీఁ గలవు నీయంగములందు
యీడుపడ నీ నిన్ను నింతకంటె నేమాడేను
యేడలేని యానలు నీవేల పెట్టేవిఁకను
(॥నమ్ము॥)
నగితివట యేడనో నాలి చేసినచేఁతకు
తగుదు వన్నియు వింటిఁ దరుణిచేత
యెగసక్యానకు నే నింత కంటే నేమిసేసే
తగిలి సతుల నేల తారుకాణించేవు
(॥నమ్ము॥)
నన్నేలితివి కాఁగిట ననుపు లక్కడివలె
కన్నులెదుటనే నాకుఁ గానవచ్చెను
యెన్నఁగ శ్రీవేంకటేశ ఇంతకంటె నిఁక నేమి
పన్నిననగవులేల పచారించేవు
(||pallavi||)
nammuduru yim̐ka ninnu nalinākṣhulu
vummaḍi niṁkānela vŏḍam̐barasevu
(||nammu||)
veḍugagām̐ḍavaidivi vichchi vichchi ābĕ nādo-
nāḍinannīm̐ galavu nīyaṁgamulaṁdu
yīḍubaḍa nī ninnu niṁtagaṁṭĕ nemāḍenu
yeḍaleni yānalu nīvela pĕṭṭevim̐kanu
(||nammu||)
nagidivaḍa yeḍano nāli sesinasem̐tagu
tagudu vanniyu viṁṭim̐ daruṇiseda
yĕgasakyānagu ne niṁta kaṁṭe nemisese
tagili sadula nela tārugāṇiṁchevu
(||nammu||)
nannelidivi kām̐giḍa nanubu lakkaḍivalĕ
kannulĕduḍane nāgum̐ gānavachchĕnu
yĕnnam̐ga śhrīveṁkaḍeśha iṁtagaṁṭĕ nim̐ka nemi
panninanagavulela pasāriṁchevu