నమ్మినవారి పాలిటి నచ్చిన చింతామణి
(॥పల్లవి॥)
నమ్మినవారి పాలిటి నచ్చిన చింతామణి
నమ్మి వరాలిచ్చే విదే పదవేమి గడమా
(॥నమ్మి॥)
పూచినతంగెడువంటి పొలిఁతి నీవురమునఁ
నేచినది నీసింగార మేమి చెప్పేది
కాచి పండినకల్పవృక్షమువలె నీమేను
చేచేత దొరకెనిదె సిరులేమి గడమా
(॥నమ్మి॥)
అరచేతిమాణ్యిమై యాపె నీపొత్తున
యెరుక సే శారగించీ నేమి చెప్పేది
గురుతైన నీలాల కొండవలె నీవు నీవు
జరగుచు నున్నారు జయమేమి గడమా
(॥నమ్మి॥)
ముంగిట నిధానమైన మోహపుటలమేల్మంగ
అంగమందే కొలువున్న దదివో నీకు
సంగతి శ్రీవేంకటేశ సరిఁ బరుసవేదివై
సంగడినున్నారు మాకు చనమేమి గడమా
(||pallavi||)
namminavāri pāliḍi nachchina siṁtāmaṇi
nammi varālichche vide padavemi gaḍamā
(||nammi||)
pūsinadaṁgĕḍuvaṁṭi pŏlim̐ti nīvuramunam̐
nesinadi nīsiṁgāra memi sĕppedi
kāsi paṁḍinagalbavṛkṣhamuvalĕ nīmenu
seseda dŏragĕnidĕ sirulemi gaḍamā
(||nammi||)
arasedimāṇyimai yābĕ nībŏttuna
yĕruga se śhāragiṁchī nemi sĕppedi
gurudaina nīlāla kŏṁḍavalĕ nīvu nīvu
jaragusu nunnāru jayamemi gaḍamā
(||nammi||)
muṁgiḍa nidhānamaina mohabuḍalamelmaṁga
aṁgamaṁde kŏluvunna dadivo nīgu
saṁgadi śhrīveṁkaḍeśha sarim̐ barusavedivai
saṁgaḍinunnāru māgu sanamemi gaḍamā