Nammigichchina vaamdavu nannela maṟasevu

నమ్మికిచ్చిన వాఁడవు నన్నేల మఱచేవు
Language

(॥పల్లవి॥)
నమ్మికిచ్చిన వాఁడవు నన్నేల మఱచేవు
యిమ్ములఁ గలకాలము యేలేవు నన్నును

(॥నమ్మి॥)
చిత్తమురా మాఁటలాడి చేతులెత్తి నీకు మొక్కి
హత్తి నీసేవ సేసేదే యది నా వోజ
బత్తితోడ నీరూపు భావించి సంతోసాన
యిత్తల నేనుండఁగానే యేలేవు నన్నును

(॥నమ్మి॥)
కనుసన్నల మెలఁగి కాఁపురము నీకుఁజేసి
వినయము చూపేది వేడుక నాది
మనసు నీపైఁబెట్టి మచ్చికలు నీకుఁజేసి
యెనసి నీతో నవ్వఁగా యేలేవు నన్నును

(॥నమ్మి॥)
పాయక నీవద్ద నుండి పైకొని నిన్నుఁబొగడి
నీ యిచ్చలో మెలఁగుటే నేరుపు నాకు
కాయజకేలిఁ బెనఁగి కాఁగిటిలో నుండఁగాను
యేయెడా శ్రీవేంకటేశ యేలేవు నన్నును

(||pallavi||)
nammigichchina vām̐ḍavu nannela maṟasevu
yimmulam̐ galagālamu yelevu nannunu

(||nammi||)
sittamurā mām̐ṭalāḍi sedulĕtti nīgu mŏkki
hatti nīseva sesede yadi nā voja
battidoḍa nīrūbu bhāviṁchi saṁtosāna
yittala nenuṁḍam̐gāne yelevu nannunu

(||nammi||)
kanusannala mĕlam̐gi kām̐puramu nīgum̐jesi
vinayamu sūbedi veḍuga nādi
manasu nībaim̐bĕṭṭi machchigalu nīgum̐jesi
yĕnasi nīdo navvam̐gā yelevu nannunu

(||nammi||)
pāyaga nīvadda nuṁḍi paigŏni ninnum̐bŏgaḍi
nī yichchalo mĕlam̐guḍe nerubu nāgu
kāyajagelim̐ bĕnam̐gi kām̐giḍilo nuṁḍam̐gānu
yeyĕḍā śhrīveṁkaḍeśha yelevu nannunu