నమ్మిక లియ్యవచ్చేవు నాకిట్టే నీవు
(॥పల్లవి॥)
నమ్మిక లియ్యవచ్చేవు నాకిట్టే నీవు
నెమ్మది నీ యాండ్లలో నే నొకతెఁ గానా
(॥నమ్మి॥)
వెగటులేనియట్టివేడుకకాఁడవు నీవు
నగకుండఁగలవా నాతులతోను
తగులు గలిగిన వింతలులేనిచుట్టమవు
మొగమైనాఁ జూడక మోము వంచఁగలవా
(॥నమ్మి॥)
అందుకోలువావులఆసొదకాఁడవు నీవు
పొందకుండఁగలవా పొలఁతులను
చందపుమరుగరిడీసాదనకాఁడవు నీవు
సందడిఁ జన్నులపైఁ జేయిచాఁచకుండఁగలవా
(॥నమ్మి॥)
చలమరిజవ్వనపుజాజరకాఁడవు నీవు
కలయకుండఁగలవా కాంతలను
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితిని నన్ను నీకత లిన్ని గలవా
(||pallavi||)
nammiga liyyavachchevu nāgiṭṭe nīvu
nĕmmadi nī yāṁḍlalo ne nŏgadĕm̐ gānā
(||nammi||)
vĕgaḍuleniyaṭṭiveḍugagām̐ḍavu nīvu
nagaguṁḍam̐galavā nāduladonu
tagulu galigina viṁtalulenisuṭṭamavu
mŏgamainām̐ jūḍaga momu vaṁcham̐galavā
(||nammi||)
aṁdugoluvāvulaāsŏdagām̐ḍavu nīvu
pŏṁdaguṁḍam̐galavā pŏlam̐tulanu
saṁdabumarugariḍīsādanagām̐ḍavu nīvu
saṁdaḍim̐ jannulabaim̐ jeyisām̐saguṁḍam̐galavā
(||nammi||)
salamarijavvanabujājaragām̐ḍavu nīvu
kalayaguṁḍam̐galavā kāṁtalanu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidini nannu nīgada linni galavā