Nammiga liyyavachchevu naagaa neevu

నమ్మిక లియ్యవచ్చేవు నాకా నీవు
Language

(॥పల్లవి॥)
నమ్మిక లియ్యవచ్చేవు నాకా నీవు
తమ్ములపు నోర నిఁకఁ దడవకు పనులు

(॥నమ్మి॥)
చెక్కిటి చేఁతలమీఁద సెలవినవ్వలమీఁద
మొక్కిన మొక్కులమీఁద మోచె నీమాట
యెక్కువతక్కువలేల ఇంకా సాకిరులేల
దక్కె నీవేడుకలెల్లా తడవకు పనులు

(॥నమ్మి॥)
వొట్టినచెమట మీఁద వొరగుఁదురుముమీఁద
నిట్టూరుపులమీఁద నిండె నీమాట
వట్టియాన లిఁకనేల వలవనిముచ్చటేల
దట్టమాయ నేరుపెల్లఁ దడవకు పనులు

(॥నమ్మి॥)
కన్నులచూపుల మీఁద కాయపుకళలమీఁద
మున్నిటి రతులమీఁద ముంచె నీమాట
యెన్నిక శ్రీవేంకటేశ ఇద్దరముఁ గూడితిమి
తన్నుఁదానె నైకమాయఁ దడవకు పనులు

(||pallavi||)
nammiga liyyavachchevu nāgā nīvu
tammulabu nora nim̐kam̐ daḍavagu panulu

(||nammi||)
sĕkkiḍi sem̐talamīm̐da sĕlavinavvalamīm̐da
mŏkkina mŏkkulamīm̐da mosĕ nīmāḍa
yĕkkuvadakkuvalela iṁkā sāgirulela
dakkĕ nīveḍugalĕllā taḍavagu panulu

(||nammi||)
vŏṭṭinasĕmaḍa mīm̐da vŏragum̐durumumīm̐da
niṭṭūrubulamīm̐da niṁḍĕ nīmāḍa
vaṭṭiyāna lim̐kanela valavanimuchchaḍela
daṭṭamāya nerubĕllam̐ daḍavagu panulu

(||nammi||)
kannulasūbula mīm̐da kāyabugaḽalamīm̐da
munniḍi radulamīm̐da muṁchĕ nīmāḍa
yĕnniga śhrīveṁkaḍeśha iddaramum̐ gūḍidimi
tannum̐dānĕ naigamāyam̐ daḍavagu panulu