నమ్మిక గావలె నిన్ను ననిచినదాఁకాను
(॥పల్లవి॥)
నమ్మిక గావలె నిన్ను ననిచినదాఁకాను
కొమ్మ నీపాలఁ గలిగె కొత్తపెండ్లికూఁతురు
(॥॥)
మచ్చిక నప్పుడాకెతో మాటలేమేమాడితివో
యెచ్చటా మఱవకుమీ యెదలోనను
నిచ్చ నీవొద్దిచెలుల నీవోజ యెఱుఁగుదురు
కొచ్చి యానెలఁత నీకు కొత్తపెండ్లికూఁతురు
(॥॥)
సరవి నేకతమున చనవు లేమిచ్చితివొ
తరవాతఁ జెల్లించుమీ తప్పకుండాను
పొరుగిరుగువారు నీబూటకాన కోపుదురు
గొరబుల నీవనిత కొత్త పెండ్లికూఁతురు
(॥॥)
కట్టిగా నన్ను నేలి సరి నాపెఁ గూడితివి
ఇట్టె మన్నించుమీ యెన్నికగాను
నెట్టన శ్రీ వేంకటేశ నీదేవుళ్లెల్లా దిట్టలు
గుటున నీకన్నెయైతే కొత్తపెండ్లికూఁతురు
(||pallavi||)
nammiga gāvalĕ ninnu nanisinadām̐kānu
kŏmma nībālam̐ galigĕ kŏttabĕṁḍligūm̐turu
(||||)
machchiga nappuḍāgĕdo māḍalememāḍidivo
yĕchchaḍā maṟavagumī yĕdalonanu
nichcha nīvŏddisĕlula nīvoja yĕṟum̐guduru
kŏchchi yānĕlam̐ta nīgu kŏttabĕṁḍligūm̐turu
(||||)
saravi negadamuna sanavu lemichchidivŏ
taravādam̐ jĕlliṁchumī tappaguṁḍānu
pŏrugiruguvāru nībūḍagāna kobuduru
gŏrabula nīvanida kŏtta pĕṁḍligūm̐turu
(||||)
kaṭṭigā nannu neli sari nābĕm̐ gūḍidivi
iṭṭĕ manniṁchumī yĕnnigagānu
nĕṭṭana śhrī veṁkaḍeśha nīdevuḽlĕllā diṭṭalu
guḍuna nīgannĕyaide kŏttabĕṁḍligūm̐turu