నమ్మితిఁ గదవే నిన్ను నాకుఁ జెల్లెలవంటాను
(॥పల్లవి॥)
నమ్మితిఁ గదవే నిన్ను నాకుఁ జెల్లెలవంటాను
కమ్మరి నాతనితోడ కాకు సేతురటవే
(॥సమ్మి॥)
వింటినే నా చెవులను విభునితో నీ వాడఁగా
అంటలేదనుచునేల ఆనవెట్టేవే
దంటవు నీవామాట తలఁచుకొనవే నీవే
టున నే నాడేనంటే నాకే సిగ్గయ్యీని
(॥సమ్మి॥)
ఇట్టె కంటినే నాకన్నులెదుట సన్నసేయఁగా
గట్టిగా నాకేల మతకము సేసేవే
రట్టడివి నీవే యాగుట్టు దెలుసుకోవే
వొట్టి నే నడిగేనంటే వొగి నవ్వు వచ్చీని
(॥సమ్మి॥)
నెఱిఁ బట్టుకొంటిఁగదే నీవే లేక లంపఁగాను
గుఱిగాక యేల మఱఁగులు వెట్టేవే
యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డిద్దరి నేలినాఁడు
మఱి చూచుకొనేనంటే వెఱగయ్యీ నాకు
(||pallavi||)
nammidim̐ gadave ninnu nāgum̐ jĕllĕlavaṁṭānu
kammari nādanidoḍa kāgu seduraḍave
(||sammi||)
viṁṭine nā sĕvulanu vibhunido nī vāḍam̐gā
aṁṭaledanusunela ānavĕṭṭeve
daṁṭavu nīvāmāḍa talam̐sugŏnave nīve
ṭuna ne nāḍenaṁṭe nāge siggayyīni
(||sammi||)
iṭṭĕ kaṁṭine nāgannulĕduḍa sannaseyam̐gā
gaṭṭigā nāgela madagamu seseve
raṭṭaḍivi nīve yāguṭṭu dĕlusugove
vŏṭṭi ne naḍigenaṁṭe vŏgi navvu vachchīni
(||sammi||)
nĕṟim̐ baṭṭugŏṁṭim̐gade nīve lega laṁpam̐gānu
guṟigāga yela maṟam̐gulu vĕṭṭeve
yĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ ḍiddari nelinām̐ḍu
maṟi sūsugŏnenaṁṭe vĕṟagayyī nāgu