Nammidim dana sittamu naa bhaagyame

నమ్మితిఁ దన చిత్తము నా భాగ్యమే
Language

(॥పల్లవి॥)
నమ్మితిఁ దన చిత్తము నా భాగ్యమే
తెమ్మలుగాఁ దనలోనే తెలుసుకొమ్మనవే

(॥॥)
మనసు మర్మ మెరుఁగు మాటలసంగ తెరుఁగు
యెనసి విన్నపములు ఇఁకనేఁటికే
చెనకులు నా మేనివి చేఁతలు తనకు దక్కే
నొనరఁ దనసొమ్మయి వున్నదాననే

(॥॥)
చదివించివాఁ డు దానె చనవు దా నిచ్చినదే
యిదె నామతి సోదించే దెందాఁ కనే
మొదలఁ బెండ్లాడినాఁ డు మోహము సేయించుకొనె
కదిసి కంకణ మిదె కట్టుకొంటినే

(॥॥)
కాయముపైఁ జెయివేసి కళలంటి కూడినాఁడు
యీయెడ నొడఁ బరచే దెంతటిపనే
పాయఁడు శ్రీ వేంకటాద్రిపతి దా నన్నెప్పుడును
పాయమెల్లాఁ గానుకగాఁ బట్టితి నేఁ గదవే

(||pallavi||)
nammidim̐ dana sittamu nā bhāgyame
tĕmmalugām̐ danalone tĕlusugŏmmanave

(||||)
manasu marma mĕrum̐gu māḍalasaṁga tĕrum̐gu
yĕnasi vinnabamulu im̐kanem̐ṭige
sĕnagulu nā menivi sem̐talu tanagu dakke
nŏnaram̐ danasŏmmayi vunnadānane

(||||)
sadiviṁchivām̐ ḍu dānĕ sanavu dā nichchinade
yidĕ nāmadi sodiṁche dĕṁdām̐ kane
mŏdalam̐ bĕṁḍlāḍinām̐ ḍu mohamu seyiṁchugŏnĕ
kadisi kaṁkaṇa midĕ kaṭṭugŏṁṭine

(||||)
kāyamubaim̐ jĕyivesi kaḽalaṁṭi kūḍinām̐ḍu
yīyĕḍa nŏḍam̐ barase dĕṁtaḍibane
pāyam̐ḍu śhrī veṁkaḍādribadi dā nannĕppuḍunu
pāyamĕllām̐ gānugagām̐ baṭṭidi nem̐ gadave