Nammidi nee sittamimka naa bhaagyamu

నమ్మితి నీ చిత్తమిఁక నా భాగ్యము
Language

(॥పల్లవి॥)
నమ్మితి నీ చిత్తమిఁక నా భాగ్యము
వుమ్మడి నూరకుండిన వొచ్చమే కాదా

(॥నమ్మి॥)
కేరడాలు చూచి నీవు కేరి కేరి నవ్వఁగాను
చేరి నావిన్న పా లింక సిగ్గు గాదా
వీరివారివాదుతెల్ల విచారించకుండఁగాను
కూరిమి గొసరఁబోతే కూళతనము గాదా

(॥నమ్మి॥)
చయ్యాటపుసవతుల సరిఁ బెట్టుకుండఁగాను
నెయ్యాన నీవద్ద నుంటే నేరము గాదా
యియ్యెడ నంతేసిచన విచ్చినీ వుండఁగాన
అయ్యో నీవొడఁబాట్లారడే కాదా

(॥నమ్మి॥)
కందువ కాఁగిట నీవు కలసి నాకుండఁగాను
ఇందు నిన్ను బాడుగు టెరవే కాదా
పొందితి శ్రీవేంకటేశ భోగము నే నెరుఁగుదు
మందలించి పొగడిన మాయలే కాదా

(||pallavi||)
nammidi nī sittamim̐ka nā bhāgyamu
vummaḍi nūraguṁḍina vŏchchame kādā

(||nammi||)
keraḍālu sūsi nīvu keri keri navvam̐gānu
seri nāvinna pā liṁka siggu gādā
vīrivārivādudĕlla visāriṁchaguṁḍam̐gānu
kūrimi gŏsaram̐bode kūḽadanamu gādā

(||nammi||)
sayyāḍabusavadula sarim̐ bĕṭṭuguṁḍam̐gānu
nĕyyāna nīvadda nuṁṭe neramu gādā
yiyyĕḍa naṁtesisana vichchinī vuṁḍam̐gāna
ayyo nīvŏḍam̐bāṭlāraḍe kādā

(||nammi||)
kaṁduva kām̐giḍa nīvu kalasi nāguṁḍam̐gānu
iṁdu ninnu bāḍugu ṭĕrave kādā
pŏṁdidi śhrīveṁkaḍeśha bhogamu ne nĕrum̐gudu
maṁdaliṁchi pŏgaḍina māyale kādā